- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Nagarjuna Sagar : సాగర్కు పోటెత్తిన పర్యాటకులు.. భారీగా ట్రాఫిక్ జామ్
దిశ, నాగార్జునసాగర్ : నాగార్జునసాగర్‌లో కృష్ణానది హోయలను చూసేందుకు తెలుగు రాష్ట్రాల నుంచి ప్రజలు భారీగా తరలివచ్చారు. దీంతో సాగర్ పరిసరాలన్నీ కిటకిటలాడాయి. ఎన్నో ఆశలతో ప్రపంచ పర్యాటక కేంద్రమైన నాగార్జునసాగర్‌కు వచ్చిన పర్యాటకులకు మాత్రం నిరాశ ఎదురైంది. నాగార్జునసాగర్ జలాశయం నిండుకుండలా మారి కొత్త అందాలను సంతరించుకుంది. వారం రోజులుగా ప్రాజెక్టు క్రస్ట్‌గేట్ల నుంచి దిగువకు నీటి విడుదల కొనసాగుతోంది. వరుస సెలవులు కావడంతో కృష్ణమ్మ పరవళ్ళను చూసేందుకు పర్యాటకులు నాగార్జునసాగర్‌కు తరలివస్తున్నారు. సాగర్ వద్దకు వచ్చిన ప్రతి పర్యాటకుడు కృష్ణమ్మ అలల పై లాంచీ ప్రయాణం చేసి మధురమైన అనుభూతి పొందుతుంటారు. నాగార్జునసాగర్ నుంచి నాగార్జున కొండకు పర్యాటకులను తీసుకువెళ్లే తెలంగాణ టూరిజం శాఖ లాంచీలను నిలిపి వేసింది. దీంతో సాగర్ సందర్శనకు వచ్చిన పర్యాటకులు నాగార్జున కొండను సందర్శించే అవకాశం లేకుండా పోయింది. కనీసం జాలీ ట్రిప్పులో సాగర్ జలాశయంలో విహరించే అవకాశం లేక నిరాశకు గురయ్యారు.
విజయ విహార్ నుంచి లాంచీస్టేషన్‌ను నాలుగు రోజుల క్రితం డౌన్ పార్కు వద్దకు మార్చారు. రెండు రోజులపాటు నాగార్జునకొండ, రిజర్వాయర్‌లో జాలీ ట్రిప్పులను నిర్వహించింది. ఏమైందో ఏమో కానీ తెలంగాణ టూరిజం నుంచి ఒక్కసారిగా లాంచీల రాకపోకలు నిలిచిపోయాయి. సాగర్ డ్యాం జలవిన్యాసాలను చూసిన సందర్శకులు లాంచీలో విహరిద్దామని గంటల తరబడి బోటింగ్ పాయింట్ వద్ద ఎదురు చూశారు. అయితే సాగర్కు వరద ప్రవాహం ఎక్కువగా ఉండడంతో పర్యాటకుల భద్రత దృష్ట్యా నాగార్జున కొండ, జాలీ ట్రిప్పులను నిలిపి వేయాలని అధికారులు ఆదేశించినట్టు లాంచి స్టేషన్ సిబ్బంది చెబుతున్నారు. దీంతో పర్యాటకులు నిరాశతో వెనుదిరిగారు.
రాష్ట్ర రాజధాని హైదరాబాద్ తో పాటు తెలుగు రాష్ట్రాలకు చెందిన పర్యాటకులు భారీ సంఖ్యలో నాగార్జున సాగర్ కు తరలివచ్చారు. దీంతో నాగార్జునసాగర్ కొత్త బ్రిడ్జి సమీపంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ట్రాఫిక్ జామ్ నియంత్రించేంతగాను పోలీసులు నానా తంటాలు పడాల్సి వచ్చింది. ఆదివారం సెలవు దినం కావడంతో జనరద్ధి విపరీతంగా ఉండడంతో ప్రధాన డ్యాం, పవర్ హౌస్ పరిసరాలకు వెళ్లకుండా పోలీసులు ఆంక్షలు విధించారు. సాగర్ జలాశయం గేట్ల ద్వారా విడుదలవుతున్న కృష్ణమ్మ అందాలను వీక్షిస్తూ చూస్తూ పర్యాటకులు తమ కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి మొబైల్ ఫోన్లలో సెల్ఫీలు తీసుకున్నారు. సాగర్‌లో ఉన్న పర్యాటక ప్రాంతాలైన బుద్ధవనం, నాగార్జునకొండ మ్యూజియం, సమ్మక్క సారక్క, ప్రధాన డ్యాం, శివాలయం ఘాట్, పవర్ హౌస్, అనుపు, కొత్త వంతెన తదితర ప్రదేశాలను సందర్శించి ఎంజాయ్ చేశారు. నాగార్జునకొండను చూసేందుకు పర్యాటకులు పెద్దఎత్తున వెళ్లి వస్తున్నారు.
ఇందుకు గాను పర్యాటక శాఖ అధికారులు లాంచీ ట్రిప్పులను నడుపుతోంది. 8 గేట్లు ఎత్తివేత, గత మూడు రోజులుగా సాగర్ 26 గేట్ల నుంచి దిగువకు భారీగా నీటి విడుదల చేసిన అధికారులు ఎగువ నుంచి నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ కు ఇన్ ప్లో బాగా తగ్గిపోయింది. దీంతో ఆదివారం నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ 8 గేట్లను 5 ఫీట్ల ఎత్తు ఎత్తి 63,040 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. శ్రీశైలం నుంచి సాగర్కు 10,3886 క్యూసెక్కుల వస్తుండగా, 12,0442 క్యూసెక్కులను ఔట్‌ఫ్లో గా వదులుతున్నారు. కాగా సాగర్ పూర్తి స్థాయి నీటిమట్టం 590 అడుగులు (నీటి నిల్వ సామర్థ్యం 312.5050) టీఎంసీలు కాగా, ప్రస్తుతం 587.90 అడుగులు (నిల్వ సామర్థ్యం 306. 0414 టీఎంసీలకు చేరుకుంది. సాగర్ నుంచి కుడి కాల్వ ద్వారా 741 క్యూసెక్కులు, ఎడమ కాల్వ ద్వారా 8367 క్యూసెక్కులు, మెయిన్ పవర్ హౌస్ ద్వారా 29,638 క్యూసెక్కులు, ఎస్‌ఎల్‌బీసీ ద్వారా 1,800 క్యూసెక్కులు, ఎల్ఎల్సీ నుంచి 300 క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు.
ముఖ్యంగా ఎత్తిపోతల జలపాతం చూసేందకు పెద్ద ఎత్తున పర్యాటకులు వస్తున్నారు. ఇక్కడ సహజ సిద్ధంగా 70 అడుగుల ఎత్తు ఉన్న కొండల మధ్య నుండి జాలువారుతున్న జలపాతాల దృశ్యాన్ని చూస్తున్న పర్యటకులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఫోన్లతో సెల్ఫీలు, గ్రూప్ ఫోటోలు తీసుకుంటూ కుటుంబాలు ఎంజాయ్ చేస్తున్నాయి. మరోవైపు పర్యాటకుల కోసం ఎత్తిపోతల జలపాతం వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేసింది పర్యాటకశాఖ. చిన్నారులకు జంపింగ్ నెట్స్తో పాటు ప్రత్యేక క్యాంటీన్లను ఏర్పాటు చేశారు.
ప్రకృతి సోయగాల మధ్య జాలువారుతున్న కృష్ణమ్మ పరవల్లను చూసి.. సేదతీరుతూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు పర్యాటకులు. గడిచిన రెండు సంవత్సరాలు తర్వాత సాగర్ కు పెద్ద ఎత్తున వరద ప్రవాహం రావడంతో పాటు.. ఆదివారం సెలవు దినం కావడంతో పర్యాటకులు అధిక సంఖ్యలో జలపాతాలను వీక్షించేందుకు పల్నాడు ప్రాంతానికి తరలివస్తున్నారు.
ఎగువ నుంచి వస్తున్న వరద నీటీతో నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు జలకళ సంతరించికుంది.. దీంతో పర్యాటకులు పోటెత్తారు. ఆదివారం సెలవు రోజు కావడంతో సాగర్ డ్యాం, పరిసర ప్రాంతాల ప్రకృతి అందాలను తిలకించేందుకు పర్యాటకులు భారీగా వచ్చారు. దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ట్రాఫిక్ క్లియర్ చేయకుండా పోలీసులు చోద్యం చూస్తున్నారని పర్యాటకులు, స్థానికులు అంటున్నారు. ప్రాజెక్టు వద్ద, విద్యుత్ కేంద్రం వద్దకు కేవలం పోలీసుల కుటుంబ సభ్యులు, బంధువుల వాహనాలు మాత్రమే పంపిస్తున్నారని ఆరోపిస్తున్నారు. వందల కిలోమీటర్లు నుంచి వచ్చిన వాహనాలను అనుమతించడం లేదని అసహనం వ్యక్తం చేశారు. మీడియాను కూడా లోనికి రానివ్వడం లేదు. దీంతో పర్యాటకులు పిల్లలతో సహా ఎండలో భారీ ట్రాఫిక్ తో ఇబ్బందులు పడుతున్నారు. ఇదేంటని ప్రశ్నిస్తే పోలీసులు బూతులు తిడుతున్నారని పర్యాటకులు మండిపడ్డారు.
తెలంగాణ పర్యాటక సంస్థ..
ప్రపంచ పర్యాటక కేంద్రమైన నాగార్జునసాగర్‌కు సాధారణ రోజుల కంటే రిజర్వాయర్ పూర్తిగా నిండిన సమయంలోనే పర్యాటకులు భారీగా తరలివస్తుంటారు. సాగర్కు వచ్చిన ప్రతి పర్యాటకుడు.. సాగర్ జలాల పై లాంచీ విహారానికి ఇష్టపడుతుంటారు. దీంతో కొన్ని వందల మంది పర్యాటకుల కోసం నాగార్జునకొండ, జాలీ ట్రిప్పులకు తెలంగాణ పర్యాటక శాఖ లాంచీలను నడుపుతోంది. దీంతో సాధారణ రోజుల కంటే సాగర్ నిండిన సమయంలో లాంచి స్టేషన్ కు భారీగా ఆదాయం సమకూరుతోంది. రెండు రోజులుగా తెలంగాణ వైపు నుంచి నాగార్జునకొండ, జాలీ ట్రిప్పులకు లాంచీలను నిలిపియడంతో భారీగా ఆదాయాన్ని కోల్పోతోంది తెలంగాణ టూరిజం శాఖ.
ఏపీ వైపు నుంచి నడుస్తున్న లాంచీలు..
సాగర్ జలాశయంలో తెలంగాణ టూరిజం లాంచీల రాకపోకలు నిలిపివేసినా ఏపీ నుంచి లాంచీలను నాగార్జున కొండకు యధావిధిగా నడుపుతోంది. ఆంధ్రా వైపు లాంచీలకు లేని వరద ప్రమాదం తెలంగాణకే ఉంటుందా అని పర్యాటకులు ప్రశ్నిస్తున్నారు. తెలంగాణ టూరిజం లాంచీలను అందుబాటులోకి తీసుకురాకపోవడంతో సంబంధిత అధికారుల పై పర్యాటకులు ఆగ్రహం, అసహనం వ్యక్తం చేస్తూ నిరాశతో వెనుదిరిగారు.