న్యాయం చేయాలంటూ సెల్ టవర్ ఎక్కి రైతు నిరసన

by Javid Pasha |   ( Updated:2022-12-03 15:02:36.0  )
న్యాయం చేయాలంటూ సెల్ టవర్ ఎక్కి రైతు నిరసన
X

దిశ, వేములపల్లి (మాడుగులపల్లి): పక్కనున్న రైతు ఇబ్బందులకు గురి చేస్తున్నాడని ఓ రైతు సెల్ టవర్ ఎక్కి నిరసన వ్యక్తం చేసిన సంఘటన మాడుగుల పల్లి మండలంలోని కనేకల్ గ్రామంలో శనివారం చోటుచేసుకుంది. గ్రామస్తులు, బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన గంట పంగ యాదయ్యకు గ్రామ శివారులోని 242 సర్వే నెంబర్ లో వ్యవసాయ భూమి ఉంది. అయితే తన పొలం పక్కనే భూమి గల రైతు బాట కావాలంటూ రైతు యాదయ్యను ఇబ్బందులకు గురిచేస్తున్నాడు. యాదయ్య బాట ఇచ్చేదిలేదని తేల్చి చెప్పడంతో అతడిపై కక్షసాధింపుకు దిగాడు. ప్రజా ప్రతినిధులతో ఫోన్లు చేయించి బెదిరిస్తున్నాడని గ్రామస్థులు తెలిపారు. దీంతో తీవ్ర ఆందోళనకు గురైన సదరు రైతు సెల్ టవర్ ఎక్కి నిరసన వ్యక్తం చేశాడు. గ్రామస్తులు సర్ది చెప్పడంతో సెల్ టవర్ పై నుంచి దిగాడు. పోలీసులు కల్పించుకొని తనకు న్యాయం చేయాలని సదరు రైతు డిమాండ్ చేస్తున్నాడు.

Advertisement

Next Story

Most Viewed