- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఎలక్షన్ కోడ్ ను అతిక్రమించిన కానిస్టేబుల్ పై వేటు
by Kalyani |
X
దిశ, నేరేడుచర్ల ( పాలకవీడు ) : పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఎలక్షన్ రూల్స్ అతిక్రమిస్తే ఎవరికైనా చర్యలు తప్పవని సూర్యాపేట జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే ఐపిఎస్ స్పష్టం చేశారు. ఎలక్షన్ కోడ్ అమలులో ఉన్న నేపథ్యంలో రూల్స్ అతిక్రమిస్తే ఎవరినైనా క్షమించేది లేదని నిరూపించారు. గత మూడు రోజుల క్రితం( ఈనెల 8న) నేరేడుచర్ల మున్సిపల్ కౌన్సిలర్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కొనతం చిన్న వెంకటరెడ్డి బర్త్ డే వేడుకలలో పాలకవీడులో కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్న నేరేడుచర్ల పట్టణానికి చెందిన చింతలచెరువు విష్ణు ఎలక్షన్ కోడ్ అతిక్రమించి వేడుకల్లో పాల్గొనడం జరిగింది. కొందరు ఇదే విషయాన్ని జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే ఐపీఎస్ దృష్టికి తీసుకు వెళ్లడం తో దానిపై విచారణ అనంతరం ఆయన సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లు సమాచారం.
Advertisement
Next Story