నల్లగొండ జనసేన ఇన్‌చార్జి సతీశ్ రెడ్డి తండ్రి కన్నుమూత

by GSrikanth |
నల్లగొండ జనసేన ఇన్‌చార్జి సతీశ్ రెడ్డి తండ్రి కన్నుమూత
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ జనసేన పార్టీలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. నల్లగొండ జిల్లా జనసేన పార్టీ ఇన్‌చార్జి మేకల సతీశ్ రెడ్డి తండ్రి కన్నమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంగా ఆయన.. ఆదివారం ఇంట్లోనే తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా(ట్విట్టర్) వేదికగా స్వయంగా సతీశ్ రెడ్డి ప్రకటించారు. కాగా, గత తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో సతీశ్ రెడ్డి కోదాడ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో అనుకున్న స్థాయిలో ఓట్లు పడలేదు. కేవలం 2151 ఓట్లతో నాలుగో స్థానానికి పరిమితం అయ్యాడు. కోదాడ నుంచి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి భార్య పద్మావతి ఎమ్మెల్యేగా గెలుపొందింది.

Advertisement

Next Story