కేసీఆర్‌ను ప్రధానిగా చూడాలన్నదే నా కల: తోట చంద్రశేఖర్

by Satheesh |
కేసీఆర్‌ను ప్రధానిగా చూడాలన్నదే నా కల: తోట చంద్రశేఖర్
X

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సీఎం కేసీఆర్‌ను ప్రధానమంత్రిగా చూడాలన్నదే తన కల అని బీఆర్ఎస్ పార్టీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ అన్నారు. జగ్జీవన్ రామ్ ఎడ్యుకేషన్ సొసైటీ చైర్మన్ కొమ్ముల నరేంద్ర ఆధ్వర్యంలో శుక్రవారం రవీంద్రభారతిలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహం నిర్మాణ కృతజ్ఞత సభ నిర్వహించారు. ఈ సందర్భంగా తోట మాట్లాడుతూ.. దేశంలోనే ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణలో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందన్నారు. అన్నీ రాష్ట్రాలు బాగుపడాలంటే కేసీఆర్ పీఎం అయితేనే సాధ్యమన్నారు.

దళితుల సంక్షేమం కోసం, ఆర్థికాభివృద్ధి సాధించేందుకు నిరంతరం కృషి చేస్తున్నారని, దేశంలోనే బడుగు బలహీన వర్గాల కోసం పాటుపడుతున్న సీఎం కేసీఆర్ అని పేర్కొన్నారు. మంత్రి కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ.. తెలంగాణ ఏర్పాటుతోనే దళితుల అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు, తెలంగాణ రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ సాయిచంద్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి మందా జగన్నాధం, తదితరులు పాల్గొన్నారు.


Advertisement

Next Story