- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
ప్రజాపాలన దినోత్సవాలకు కలెక్టరేట్ల ముస్తాబు
దిశ వెబ్ డెస్క్ : తెలంగాణ విలీన దినోత్సవం సెప్టెంబర్ 17ను సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం తెలంగాణ ప్రజాపాలన దినోత్సవంగా నిర్వహిస్తున్న క్రమంలో ప్రజాపాలన దినోత్సవం నిర్వాహణకు అన్ని జిల్లాల కలెక్టరేట్ లలో ఏర్పాట్లు సాగుతున్నాయి. అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో, స్థానిక సంస్థల్లో జాతీయ పతాకావిష్కరణలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కోంది. తెలంగాణలోని 33 జిల్లాల్లో జెండా ఆవిష్కరణ చేసే ప్రజా ప్రతినిధుల పేర్లను ప్రభుత్వం ఖరారు చేసింది. మరోవైపు, కేంద్ర ప్రభుత్వం సెప్టెంబర్ 17ను తెలంగాణ విమోచన దినోత్సవంగా హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో అధికారిక కార్యక్రమాలు నిర్వహిస్తోంది. తాజాగా, రాష్ట్రంలో తొలిసారి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం సెప్టెంబర్ 17ను తెలంగాణ ప్రజా పాలన దినోత్సవంగా జరపాలని నిర్ణయించింది. మంత్రులు సహా స్పీకర్, శాసనమండలి చైర్మన్ ప్రభృతులు ఎక్కడెక్కడా జాతీయ జెండా ఎగురవేయాలన్నదానిపై అధికారులకు ఆదేశాలిచ్చారు. 1948 సంవత్సరం సెప్టెంబర్ 17న నిజాం నిరంకుశ పాలన నుంచి పూర్వపు హైదరాబాద్ రాష్ట్రం భారత యూనియన్‌లో విలీనమైంది.
తెలంగాణ ప్రజలు స్వేచ్చ, స్వాతంత్రాలు పొందిన ఈ రోజును కమ్యూనిస్టులు తెలంగాణ విముక్తి దినంగా, కాంగ్రెస్ తెలంగాణ విలీన దినోత్సవంగా, బీజేపీ తెలంగాణ విమోచన దినంగా, బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవంగా, న్యూడెమోక్రసీ వంటి పార్టీలు తెలంగాణ విద్రోహ దినంగా పాటిస్తువస్తున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం సెప్టెంబర్ 17ను 'ప్రజాపాలన దినోత్సవం'గా జరుపుకుంటామని పేర్కొంది. అయితే గతంలో రేవంత్‌రెడ్డి టీపీసీసీ అధ్యక్షుడిగా హైదరాబాద్ విలీన దినోత్సవాన్ని తాము అధికారంలోకి వచ్చాక అధికారికంగా నిర్వహించి త్రివర్ణ పతాకంతో పాటు ప్రత్యేక రాష్ట్ర పతాకాన్ని కూడా ఎగురవేస్తామని చెప్పారు. అయితే అనూహ్యంగా 'తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం' వేడుకలను ప్రకటిస్తూ ఉత్తర్వులు విడుదల చేశారు. 1948 సెప్టెంబర్ 17న తెలంగాణలో ప్రజాస్వామిక పాలన శకం ఆరంభమైన సందర్భాన్ని పురస్కరించుకుని రాష్ట్రంలో ప్రజాపాలన దినోత్సవం నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. మంగళవారం పబ్లిక్ గార్డెన్ లో నిర్వహించే ప్రజాపాలన దినోత్సవ వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి జాతీయ జెండా ఆవిష్కరణ చేసి ప్రసంగించనున్నారు.