మునుగోడులో గెలుపుమాదే.. ఎమ్మెల్సీ కవిత

by Nagaya |
MLC Kavitha Says Free education, healthcare not freebies
X

దిశ, తెలంగాణ బ్యూరో : ఉమ్మడి నల్లగొండ జిల్లా టీఆర్‌ఎస్‌కు కంచుకోట అని, మునుగోడు ఉపఎన్నిక ఎప్పుడొచ్చినా విజయం తమదేనని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ధీమా వ్యక్తం చేశారు. నాగార్జున సాగర్, హుజుర్ నగర్ ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ హేమహేమీలను ఓడగొట్టిన విషయాన్ని గుర్తు చేశారు. స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా బుధవారం దోమలగూడలోని భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ మోడల్ హై స్కూల్‌లో వన మహోత్సవ సంబరాలలో పాల్గొని మొక్కలు నాటారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ మునుగోడులో టీఆర్ఎస్ ఎమ్మెల్యే లేకున్నా అభివృద్ధి ఆగలేదని, కరోనా లాంటి సంక్షోభ సమయంలో కూడా తెలంగాణ వ్యాప్తంగా పెన్షన్లు, రైతు బంధు ఇతర సంక్షేమ పథకాలు ఆగలేదన్నారు. బీహార్‌ రాజకీయాలను యావత్‌ దేశం గమనిస్తోందన్నారు. బీజేపీ బ్యాక్ డోర్ రాజకీయాలు చేస్తుందని మండిపడ్డారు. ప్రజాస్వామ్యంలో ఇది మంచిది కాదని, మునుగోడు ఉప ఎన్నిక ఇలాంటి వాటికి సమాధానం చెప్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ముఠా గోపాల్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed