- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Palvai Sravanthi: మునుగోడు కాంగ్రెస్‌లో ఆడియో టేప్ కలకలం!
దిశ, వెబ్‌డెస్క్: Munugode Congress Leader Palvai Sravanthi's Controversial Audio Tape goes Viral Over Revanth Reddy| మునుగోడు ఉప ఎన్నికకు ఇంకా షెడ్యూల్ ఖరారు కాకముందే టీ-కాంగ్రెస్‌లో టికెట్ల పంచాయతీ మొదలైంది. మునుగోడు టికెట్ దక్కబోయేది తనకేనంటూ నేతలు ప్రచారం చేసుకోవడం కాంగ్రెస్ పార్టీలో కాకరేపుతోంది. ఇందుకు సంబందించిన ఓ ఆడియో టేప్ ఇప్పుడు హస్తం పార్టీలో కలకలం రేపుతోంది. టికెట్ కోసం మాజీ మంత్రి దివంగత నేత పాల్వాయి గోవర్ధన్ రెడ్డి కూతురు పాల్వాయి స్రవంతి, చెలమల కృష్ణారెడ్డి మధ్య పోటీ తీవ్రతరం అయినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో పాల్వాయి స్రవంతికి చెందినది అని ప్రచారం జరుగుతున్న ఓ ఆడియో టేప్ మునుగోడులో చక్కర్లు కొడుతోంది. కాంగ్రెస్ కార్యకర్తతో స్రవంతి మాట్లాడినట్లుగా ఈ ఆడియో టేప్‌లో ఉంది. తనకే టికెట్ దక్కుతుందని, చండూరులో ఇటీవల నిర్వహించిన సభలో టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డితో సహా సీనియర్లంతా పాల్వాయి పేరుతో పాటు తన పేరునే ప్రస్తావించారని కృష్ణారెడ్డిని చూసి ఇక్కడ ఎవరూ ఓట్లు వేయరని ఓడిపోయే వ్యక్తికి టికెట్ ఇచ్చి రేవంత్ రెడ్డి పరువు తీసుకుంటారా? అని స్రవంతి చెప్పడం సంచలనం అవుతోంది.
ఆల్రెడీ హుజూరాబాద్‌లో రేవంత్ రెడ్డి పరిస్థితి ఏంటో అందరికీ తెలుసని అన్నారు. టికెట్ కోసం ప్రయత్నం చేయాలని కార్యకర్త సూచించగా తాను గట్టి ప్రయత్నమే చేస్తున్నాననే లేకుంటే మొన్నటి చండూరు సభ ఎందుకు నిర్వహిస్తానని అన్నారు. ఈ సభకు వచ్చిన వారు తన పిలుపుతో వచ్చారా? లేక కృష్ణారెడ్డిని చూసి వచ్చారా? అని ప్రశ్నించారు. సభ తర్వాత కృష్ణారెడ్డి పేరు వినిపిస్తోందని పార్టీ పెద్దలతో లోపాయి కారి ఒప్పందం ఉన్నట్లుగా ప్రచారం జరుగుతోందని కార్యకర్త చెప్పిన మాటలు ఆడియో టేప్‌లో ఉన్నాయి. ఈ ఆడియో టేపులో నిజం ఎంతవరకు ఉన్నదన్న సంగతి పక్కన పడితే పార్టీలో టికెట్ అంశం దుమారం రేపుతోంది.
రంగంలోకి ఏఐసీసీ:
మునుగోడు టికెట్ అంశం రచ్చ చివరకు పార్టీ పరువును బజారుకీడ్చే ప్రమాదం ఉందనే టాక్ వినిపిస్తోంది. రాజగోపాల్ రెడ్డి పార్టీ వీడటంతో జరిగిన డ్యామేజ్‌ను పూడ్చాలంటే నేతలంతా ఐక్యంగా పని చేయాల్సింది పోయి ఇలా టికెట్ కోసం కినుకు వహించడం మొదటికే మోసం అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్న వేళ ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జీ మాణిక్కం ఠాగూర్ నేడు హైదరాబాద్‌కు రానున్నారు. రేపు ఉదయం 11 గంటలకు ఆయన గాంధీభవన్‌లో పార్టీ సీనియర్ నాయకులు, మునుగోడు ముఖ్య నాయకులతో ఆయన సమావేశం అయి మునుగోడులో అభ్యర్థి విషయంలో చర్చించనున్నారు. దానికంటే ముందు ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు ఏఐసీసీ కార్యదర్శి బోసురాజుతో పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ గౌడ్ భేటీ కాబోతున్నారు. పార్టీకి సంబంధించిన ముఖ్య నాయకులు, డీసీసీతో పాటు మునుగోడు నియోజకవర్గంలోని ఆరు మండలాలకు సంబంధించిన ముఖ్య నాయకులతో చర్చించనున్నారు.
ఇది కూడా చదవండి: కొంగుముడికి కోట్లు ఖర్చు.. ఏజెన్సీలో శీనన్న బిడ్డ పెళ్లి పై చర్చ
మునుగోడుపై కాంగ్రెస్ స్పెషల్ ఫోకస్.. నేడు హైదరాబాద్‌కు కీలక నేత