మున్సిపల్ టాయిలెట్స్ @నాట్ ఇన్ యూజ్

by M.Rajitha |
మున్సిపల్ టాయిలెట్స్ @నాట్ ఇన్ యూజ్
X

దిశ, జగిత్యాల ప్రతినిధి : జగిత్యాల మున్సిపల్ కాంపౌండ్ ఆవరణలో ఉన్న టాయిలెట్స్ గత కొద్ది నెలలుగా నిరుపయోగంగా ఉన్నాయి. దీంతో మున్సిపల్ ఆఫీస్ కి వచ్చే అర్జీదారులకు టాయిలెట్స్ ఉన్నా అవి అందుబాటులో ఉండటం లేదు. పురుషుల సంగతి అటు ఉంచితే మహిళలు అయితే టాయిలెట్స్ లేకపోవడంతో తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. గతంలో ఇదే తరహాలో కొద్ది రోజులు వాడుకలో ఉన్నప్పటికీ మరికొద్ది రోజులు మూసేసి ఉన్న సందర్భాలు ఉన్నాయి. దీంతో వివిధ అవసరాల నిమిత్తం మున్సిపల్ ఆఫీస్ కు వచ్చేవారు అర్జంట్ అయితే గొల్లపల్లి రోడ్డులోని సౌచాలయానికి పరుగులు తీస్తున్నారు. మున్సిపల్ ఆఫీస్ పక్కనే ఉన్న మున్సిపల్ కాంప్లెక్స్ కు వచ్చేవారు, ఇతరులు కూడా ఇవే టాయిలెట్స్ ను వినియోగించడంతో బల్దియా సిబ్బంది వాటిని మూసేసినట్లుగా తెలుస్తుంది. ఇదిలా ఉండగా ఆ టాయిలెట్స్ పక్కనే ఉన్న గోడపై మూత్ర విసర్జన చేస్తే 1000 రూపాయల జరిమానా అంటూ రాయించారు. టాయిలెట్స్ వినియోగంలోకి తీసుకువస్తే అలా రాయించాల్సిన అవసరం ఉండదు కదా అనే అభిప్రాయాన్ని పట్టణవాసులు వ్యక్తం చేస్తున్నారు. బహిరంగ మలమూత్ర విసర్జనపై అవగాహన కల్పించాల్సిన మున్సిపల్ అధికారులే కార్యాలయ ఆవరణలో ఉన్న టాయిలెట్స్ ను అందుబాటులో ఉంచకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

Next Story

Most Viewed