- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Mukesh Ambani: మరో వ్యాపారంలోకి ఎంట్రీ ఇచ్చిన ముకేశ్ అంబానీ.. రూ. 10 కే ‘స్పిన్నర్’

దిశ, డైనమిక్ బ్యూరో: ముఖేశ్ అంబానీ (Mukesh Ambani) నేతృత్వంలోని రిలయన్స్ (Reliance) మరో సరికొత్త ప్రొడక్ట్ తో మార్కెట్ లోకి వచ్చింది. కాంపా కోలాతో కూల్ డ్రింక్స్ మార్కెట్ లోకి ఇప్పటికే ఎంట్రీ ఇవ్వగా తాజాగా 'స్పిన్నర్' (Spinner) పేరుతో స్పోర్ట్స్ డ్రింక్స్ (sports drink) లోకి అడుగుపెట్టింది. మాజీ క్రికెటర్ ముత్తయ్య మురళీధరన్ తో కలిసి ఈ సరికొత్త బ్రాండ్ ను తాజాగా ఆవిష్కరించింది. ఈ స్పోర్ట్స్ డ్రింక్ ను రూ. 10 కే అందించనున్నట్లు రిలయన్స్ ఓ ప్రకటనలో పేర్కొంది. ఆరెంజ్, నైట్రో బ్లూ ప్లే వర్లో ఈ డ్రంక్ లభిస్తుంది. ఈ ప్రొడక్ట్ ప్రమోషన్ కోసం వివిధ ఐపీఎల్ టీమ్ లతో జతకట్టినట్లు రిలయన్స్ సంస్థ పేర్కొంది. జిమ్ లో కసరత్తులు, క్రీడల్లో పాల్గొనే వారు కోల్పోయే ఫ్లూయిడ్స్, ఎలక్ట్రోలైట్స్ ను తిరిగి శరీరానికి అందించేలా ఈ స్పిన్నర్ దోహదపడుతుందని రిలయన్స్ పేర్కొంది. రాబోయే మూడేళ్లలో స్పోర్ట్స్ బేవరేజెస్ కేటగిరినీ 1 బిలియన్ డాలర్ల మార్కెట్ కు చేర్చడంలో ఈ ప్రొడక్ట్ ముఖ్య పాత్ర పోషిస్తుందని ఆశాభావం వ్యక్తం చేసింది.