వరంగల్ మెడికో ప్రీతి మృతిపై స్పందించిన మందకృష్ణ

by GSrikanth |   ( Updated:2023-03-13 14:37:45.0  )
వరంగల్ మెడికో ప్రీతి మృతిపై స్పందించిన మందకృష్ణ
X

దిశ, డైనమిక్ బ్యూరో: వరంగల్ కేఎంసీ మెడికో ప్రీతి ఘటనపై ఎమ్మార్పీఎస్ జాతీయ అద్యక్షుడు మందకృష్ణ మాదిగ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం మీడియాతో మాట్లాడిన ఆయన...ప్రీతిది హత్యా, ఆత్మహత్యా..? అనేది తేలకుండానే ఆత్మహత్యాయత్నం కేసు ఎలా నమోదు చేస్తారని ప్రశ్నించారు. ప్రీతిది ఆత్మహత్యాయత్నం అని చెప్పడానికి ఆధారాలు లేవు...అప్పుడే కేసు పక్కదారి ఎలా పట్టిందని ప్రశ్నించారు.

మెడికో ప్రీతి మృతి కేసుపై ప్రభుత్వం వివక్ష చూపుతోందని మండిపడ్డారు. ప్రియాంక రెడ్డికి జరిగిన న్యాయమే ప్రీతికి జరగాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రీతి మరణంపై ఎన్నో అనుమానాలు ఉన్నాయని, ప్రీతి ఆత్మహత్య చేసుకునే అంత పిరికిది కాదని మందకృష్ణ తెలిపారు. ప్రీతి మృతి కేసును హత్య కేసుగా మార్చాలని, వెంటనే జుడీషీయరీ విచారణ జరపాలని మందకృష్ణ మాదిగ ప్రభుత్వాన్ని కోరారు.

Advertisement

Next Story