- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
తెలంగాణలో కర్ణాటక ఫలితాలు రిపీట్.. ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి
దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణలో కర్ణాటక ఫలితాలు రిపీట్ కానున్నాయని ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు. గాంధీభవన్‌లో ఆయన శనివారం మీడియాతో మాట్లాడుతూ.. కర్ణాటక రిజల్ట్స్తప్పకుండా తెలంగాణ మీద ప్రభావం చూపుతాయన్నారు. ఇక్కడ కూడా అధికారం దక్కించుకుంటామన్నారు. బీఆర్ఎస్ చేస్తున్న అవినీతి అంతా ఇంతా కదన్నారు. సీఎంవో నుంచి క్షేత్రస్థాయిలోని పోలీస్ స్టేషన్ల వరకు విచ్చలవిడిగా అవినీతిమయం అయినట్లు ఆరోపించారు. కేసీఆర్ ప్రభుత్వం కరప్షన్‌కు కేరాఫ్‌గా మారిందని విమర్శించారు.
దేశ వ్యాప్తంగా రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని పేర్కొన్నారు. కర్ణాటకలో బీజేపీకి చెంపపెట్టు రిజల్ట్ ఇవ్వడం సంతోషంగా ఉన్నదన్నారు. తెలంగాణలోనూ అసమర్థత, అవినీతి ప్రభుత్వానికి త్వరలోనే చెక్పడనున్నదని స్పష్టం చేశారు. ఇక పార్టీకి వ్యతిరేకంగా తాను ఎప్పుడూ మాట్లాడలేదని ఉత్తమ్ క్లారిటీ ఇచ్చారు. పార్టీ లో చిన్న సమస్యలు కామన్ అని వాటిని అంతర్గతంగా చర్చించుకొని పరిష్కరించుకుంటామన్నారు. రాబోయే ఎన్నికల్లో అందరం కలిసి పనిచేస్తామన్నారు.