- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘ఆమె లేకుంటే.. కేసీఆర్ తలకిందులుగా తపస్సు చేసినా తెలంగాణ వచ్చేది కాదు’
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో గాంధీభవన్‌లో నిర్వహించిన రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో నల్లగొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘తెలంగాణ ఏర్పాటుకు సంబంధించి అప్పటి హోంమంత్రి చిదంబరంతో రెండుసార్లు చర్చించాను. అది నాకు ఎంతో సంతృప్తిని ఇచ్చింది. మీరాకుమారి ఎంతో ధైర్యంతో తెలంగాణ బిల్లును పాస్ చేసారు. మీరాకుమారి ధైర్యం చేయకుంటే తెలంగాణ వచ్చేది కాదు. ఇప్పుడు ఏలుతున్న వారు తలకిందులుగా తపస్సు చేసినా తెలంగాణ వచ్చేది కాదు. తెలంగాణ ఏర్పాటును ప్రధాని మోడీ అపహాస్యం చేసారు. పార్లమెంట్ తలుపులు మూసేసి తెలంగాణ ఇచ్చారని పార్లమెంట్‌లో మోడీ ఆరోపిస్తున్నారు. బీజేపీ నేతలు తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలి.
తెలంగాణ బిల్లు పాస్ అయిన రోజు కేసీఆర్ పార్లమెంట్‌లో లేరు. మీరాకుమార్ రాష్ట్రపతి అభ్యర్థిగా హైదరాబాద్‌కు వస్తే.. మీరాకుమార్‌కు మద్దతు ఇవ్వాలని కేసీఆర్‌కు ఫోన్ చేసినా ఫోన్ లిఫ్ట్ చేయలేదు. తెలంగాణ ఏర్పాటులో కీలకపాత్ర పోషించిన మీరాకుమార్‌కు వ్యతిరేకంగా కేసీఆర్ ఓటు వేసారు. నేరేళ్ళ బాధితులను పరామర్శించేందుకు మీరాకుమార్ వస్తే.. కేసీఆర్ అవహేళన చేసారు. 9 ఏళ్ళు పూర్తయితే.. ఎన్నికల కోసం ఓక సంవత్సరం ముందుగానే దశాబ్ది ఉత్సవాలు చేస్తున్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఐకమత్యంతో ముందుకు వెళ్లాలి. ఈసారి కాంగ్రెస్ వేవ్ నడుస్తుంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను గెలిపించి సోనియా గాంధీకి కృతజ్ఞతలు తెలపాలి’’ అని ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యానించారు.
Also Read..
తెలంగాణ ప్రజల బాధను అర్థం చేసుకున్న సోనియాకు ధన్యవాదాలు: మీరా కుమార్