కాంగ్రెస్‌లో చేరిన MP రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యే దానం

by GSrikanth |   ( Updated:2024-03-17 08:57:08.0  )
కాంగ్రెస్‌లో చేరిన MP రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యే దానం
X

దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్‌కు మరో ఒకేసారి రెండు షాక్‌లు తగిలాయి. చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌లు కాంగ్రెస్‌లో చేరారు. ఆదివారం హైదరాబాద్‌లోని గాంధీ భవన్‌లో ఏఐసీసీ ఇన్‌చార్జి దీపాదాస్ మున్షీ సమక్షంలో హస్తం తీర్థం పుచ్చుకున్నారు. వారికి సీఎం రేవంత్ రెడ్డి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్ పాల్గొన్నారు.

కాగా, ఈ ఉదయమే పార్టీ మారబోతున్నట్లు వస్తోన్న వార్తలన్నీ అవస్తవమని చెప్పిన దానం నాగేందర్, గంట క్రితమే పార్టీకి రాజీనామా చేసిన రంజిత్ రెడ్డిలు ఒకేసారి షాక్ ఇవ్వడం బీఆర్ఎస్‌కు భారీ దెబ్బే అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. దీని ప్రభావం పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఉంటుందని చర్చ జరుగుతోంది. కాగా, గ్రేటర్‌లో ఒక్క ఎమ్మెల్యే కూడా లేని కాంగ్రెస్‌కు దానం నాగేందర్ తొలి అధికార పార్టీ ఎమ్మెల్యే కానున్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ఇవాళ పొద్దున్నే గేట్లు ఓపెన్ చేశాం.. ఇక బీఆర్ఎస్ ఖాళీ కావడం ఖాయమని అన్నారు.




Advertisement

Next Story

Most Viewed