Mallu Ravi: కొత్త సీసాలో పాత సారా! రాష్ట్రపతి ప్రసంగంపై ఎంపీ మల్లు రవి హాట్ కామెంట్స్

by Ramesh N |
Mallu Ravi: కొత్త సీసాలో పాత సారా! రాష్ట్రపతి ప్రసంగంపై ఎంపీ మల్లు రవి హాట్ కామెంట్స్
X

దిశ, డైనమిక్ బ్యూరో: పార్లమెంట్ బడ్జెట్ (Budget Session) సమావేశాల్లో భాగంగా ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (President Murmu) చేసిన ప్రసంగంపై కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి (Mallu Ravi) స్పందింస్తూ హాట్ కామెంట్స్ చేశారు. ఇవాళ ఆయన ఢిల్లీ పార్లమెంట్ ఆవరణలో మాట్లాడుతూ.. రాష్ట్రపతి ప్రసంగం ఎలా ఉందంటే.. కొత్త సీసాలో పాత సారాయి అన్నట్టుగా ఉందని విమర్శించారు. సీసా కొత్త ఉందని, కంటెంట్ మాత్రం అలాగే ఉందన్నారు. గతంలో ప్రధాని మోడీ ఏదైతే మాట్లాడారో అదే రాసిస్తే.. రాష్ట్రపతి చదివారని విమర్శించారు. ప్రజలు పడుతున్న బాధలు, దేశం ఎదుర్కొంటున్న నిరుద్యోగ సమస్య, అధిక ధరల గురించి రాష్ట్రపతి ఎక్కడా మాట్లాడలేదని మండిపడ్డారు. క్షేత్ర స్థాయిలో ఏ పథకం అమలు కావడం లేదు.. కానీ అన్నీ అద్భుతంగా అమలవుతున్నాయని రాష్ట్రపతి అన్నారని తెలిపారు.

దీని వల్ల కొద్ది కాలం తర్వాత పార్లమెంట్ వ్యవస్థ మీదనే యూత్‌కి నమ్మకం పోతుందని అన్నారు. రాష్ట్రపతి నార్త్ ఈస్ట్ గురించి మాట్లాడేటప్పుడు మణిపూర్‌ ఘటనపై ఒక్క మాట మాట్లాడలేదని మండిపడ్డారు. కాగా, శుక్రవారం ఉదయం 11 గంటలకు పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఉభయసభలను ఉద్దేశించి రాష్ట్రపతి ముర్ము ప్రసంగించారు. మూడో సారి అధికారంలోకి వచ్చిన ఎన్డీయే ప్రభుత్వం గత ప్రభుత్వాల పాలనతో పోలిస్తే మూడు రేట్లు వేగంతో పని చేస్తోందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. త్వరలోనే ప్రపంచంలోనే మూడో ఆర్థిక వ్యవస్థగా భారత్ మారనుందని ధీమా వ్యక్తం చేశారు.

Next Story