- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై MP కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి రియాక్షన్ ఇదే!
దిశ, డైనమిక్ బ్యూరో: ప్రగతి భవన్‌ను ఉద్దేశించి టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేసిన కూల్చివేత వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి రియాక్ట్ అయ్యారు. రేవంత్ రెడ్డి ఈ తరహా వ్యాఖ్యలు చేయకుండా ఉండాల్సిందని అన్నారు. ప్రగతి భవన్ కేసీఆర్ సొత్తు కాదని అది ప్రజల ఆస్తి అని అన్నారు. ప్రగతి భవన్‌ను కూల్చివేస్తామని అనడానికి బదులుగా ప్రజా దర్భార్ కోసం వినియోగించుకోవాలనో, ఆసుపత్రిగా వాడుకోవాలనో రేవంత్ రెడ్డి అంటే బాగుండేదని అభిప్రాయపడ్డారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో గురువారం ఓ ప్రైవేటు హోటల్ ఓపెనింగ్‌కు వచ్చిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ నెల 13న పార్లమెంట్ సమావేశాలు అయిపోయిన తర్వాత హాత్ సే హాత్ జోడోయాత్రలో పాల్గొంటానని స్పష్టం చేశారు.
నల్గొండ, మహబూబ్ నగర్, ఖమ్మం, రంగారెడ్డి నాలుగు జిల్లాలను కలుపుకొని బస్సు యాత్ర లేదా బైక్ యాత్ర ఏదో ఒకటి చేపడతానని చెప్పారు. ఎన్నికలకు సమయం తక్కువగా ఉన్నందున 12 నియోజకవర్గాలలో త్వరలో పూర్తిగా బైక్ యాత్ర చేస్తానన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2 లక్షల 90 వేల కోట్ల బడ్జెట్ పూర్తిగా అంకెల గారడీ అని విమర్శించారు. గతేడాది కూడా 2 లక్షల 25 వేల బడ్జెట్ తీసుకువచ్చినా అందులో లక్షా 75 వేల కోట్లు కూడా ఖర్చు పెట్టలేదని అన్నారు. ఈ సారి ప్రవేశపెట్టిన బడ్జెట్ ఎన్నికల బడ్జెట్ అని విమర్శించారు. మిషన్ భగీరథ విషయంలో ప్రభుత్వం పూర్తిగా ఫెయిల్ అయిందని మంత్రి జగదీశ్వర్ రెడ్డి సొంత గ్రామంలో తాగడానికి నీళ్లు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. ప్రజల ఇబ్బందులు చూడలేక తాను సొంత ఖర్చుతో వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని ప్రయత్నిస్తే అడ్డుకున్నారని ఆరోపించారు.
ఇవి కూడా చదవండి:
కేఏ పాల్ భద్రతపై చర్యలు తీసుకోండి.. డీజీపీకి హైకోర్టు ఆర్డర్!