కాంగ్రెస్ సెకండ్ లిస్ట్‌ విడుదలపై బిగ్ అప్డేట్.. MP కోమటిరెడ్డి కీలక ప్రకటన

by Satheesh |   ( Updated:2023-10-25 08:07:37.0  )
కాంగ్రెస్ సెకండ్ లిస్ట్‌ విడుదలపై బిగ్ అప్డేట్.. MP కోమటిరెడ్డి కీలక ప్రకటన
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ కాంగ్రెస్ అభ్యర్థుల సెకండ్ లిస్ట్ విడుదలపై కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ మెంబర్, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ అభ్యర్థుల రెండవ జాబితా ఈ రోజు పూర్తి అవుతుందని.. సెకండ్ లిస్ట్ రేపు విడుదల కానున్నట్లు తెలిపారు. 6 స్థానాల్లో మాత్రమే అభ్యర్థుల ఎంపిక ఇబ్బందిగా ఉందని.. అక్కడ ఇద్దరు ముగ్గురు పోటీ పడుతున్నారని చెప్పారు. మొత్తం 119 సీట్లపై రేపు (గురువారం) ఉదయం ప్రకటన ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.

అభ్యర్థులను సీఈసీ ఫైనల్ చేసే వరకు బయట మాట్లాడకూడదన్నారు. వామపక్షాలతో పొత్తులపైన ఇవాళ సాయంత్రం క్లారిటీ వస్తుందన్నారు. వామపక్షాలకు నాలుగు సీట్లు కేటాయించడమం అంటే తక్కువేమి కాదన్నారు. లెఫ్ట్ పార్టీస్ మిర్యాలగూడ సీటు అడిగారని.. కానీ అక్కడ కాంగ్రెస్ ఓటు ఎంత వరకు ట్రాన్సఫర్ అవుతుందనేది చూడాలని అన్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 70 - 80 సీట్లు సాధింస్తుందని దీమా వ్యక్తం చేశారు.

Advertisement

Next Story