- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బ్రేకింగ్: చెరుకు సుధాకర్‌కు బెదిరింపుల ఆడియోపై స్పందించిన MP కోమటిరెడ్డి
దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు చెరుకు సుధాకర్‌ను నా అనుచరులు చంపేస్తారంటూ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతోన్న విషయం తెలిసిందే. చెరుకు సుధాకర్ రెడ్డి కొడుకు చెరుకు సుహాస్‌కు కాల్ చేసి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి బెదిరింపులకు పాల్పడిన ఆడియో వైరల్ అవుతోంది. తాజాగా ఈ వివాదస్పద ఆడియోపై ఎంపీ కోమటిరెడ్డి స్పందించారు. నేను భావోదేగ్వంతోనే ఆ వ్యాఖ్యలు చేశానని.. అందులో వేరే ఉద్దేశం లేదని వివరణ ఇచ్చారు. తనను సస్పెండ్ చేయాలని, దరిద్రుడు అని తిట్టారన్న బాధతోనే అలా మాట్లాడానని చెప్పారు.
33 ఏళ్ల రాజకీయంలో జీవితంలో ప్రత్యర్థులను ఎప్పుడు దూషించలేదన్నారు. శత్రువును కూడా దగ్గరికి తీసే తత్వం తనదని వివరణ ఇచ్చారు. కానీ, చెరుకు సుధాకర్ కాంగ్రెస్ పార్టీలో చేరినప్పటీ నుండి తనను తిడుతున్నాడని.. అదే విషయమై చెరుకు సుధాకర్ కొడుకుతో మాట్లాడానని తెలిపారు. తనను దూషించవద్దని చెరుకు సుధాకర్ కొడుకు సుహాస్‌కు చెప్పానన్నారు.
చెరుకు సుధాకర్ తనను దూషిస్తే నకిరేకల్ టికెట్ వస్తుందా అని ఈ సందర్భంగా కోమటిరెడ్డి ప్రశ్నించారు. అంతేకాకుండా సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న ఆడియోలో కొన్ని విషయాలే లీక్ చేశారని.. తాను మాట్లాడిన అన్ని విషయాలు లేవన్నారు. పదే పదే తనను దూషిస్తున్నా చెరుకు సుధాకర్‌పై ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జ్ థాక్రేకు ఫిర్యాదు చేశానని తెలిపారు. గతంలో చెరుకు సుధాకర్‌పై పీడీ యాక్ట్ పెడితే తానే పోరాటం చేశానని గుర్తు చేశారు.