- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నాకు లాబీయింగ్ తెలియదు: పార్టీ పదవులపై MP కోమటిరెడ్డి హాట్ కామెంట్స్
దిశ, డైనమిక్ బ్యూరో: పార్టీలో తన ప్రాధాన్యత విషయంలో కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మరోసారి హాట్ కామెంట్స్ చేశారు. సీడబ్ల్యూసీ చోటు విషయంలో తనకు న్యాయం జరుగుతుందని ఆశాభావంతో ఉన్నట్లు చెప్పారు. గతంలో పీసీసీ పదవి ఇవ్వలేకపోయిన సందర్భంగా తనకు న్యాయం చేయలేకపోయామని, భవిష్యత్‌లో సముచిత స్థానం కల్పిస్తామని పార్టీ పెద్దలు హామీ ఇచ్చారని అన్నారు.
ప్లీనరీ కోసం రాయ్ పూర్ వెళ్లిన ఆయన అక్కడ శనివారం మీడియాతో మాట్లాడారు. సీడబ్ల్యూసీకి ఎన్నికలు ఉంటాయని భావించాం. కానీ ఆ నిర్ణయం ఏఐసీసీ చీఫ్‌కే అప్పగిస్తూ తీర్మానం చేయడంతో తనకు అవకాశం వస్తుందనే ఆశతో ఉన్నట్లు చెప్పారు. సీడబ్ల్యూసీలో చోటు కల్పిస్తే మరింత ఉత్సాహంగా పని చేస్తానని లేకుంటే తన పరిధిలోని 20 అసెంబ్లీ నియోజకవర్గాలకే పరిమితం అవుతానని చెప్పారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి పొత్తులు అక్కర్లేదని అన్నారు.
ఎన్నికలకు ముందు ఎలాంటి పొత్తులు ఉండబోవని చెప్పారు. జాతీయ స్థాయిలో సంకీర్ణ ప్రభుత్వమే వస్తుందని ఏఐసీసీ చీఫ్ ఖర్గేనే చెప్పారని గుర్తు చేశారు. రాష్ట్రంలో పార్టీ పరిస్థితులపై చర్చించేందుకు ప్రియాంక గాంధీని అపాయింట్మెంట్ కోరానని త్వరలో ఢిల్లీలో భేటీ అవుతానని చెప్పారన్నారు. అసెంబ్లీ ఎన్నికల విషయంలో సీఎం కేసీఆర్ ఎప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో తెలియదని అందువల్ల 50 శాతం సీట్లను వెంటనే ప్రకటించాలని కోరుతానన్నారు. గత ఎన్నికల్లో టికెట్లు, పొత్తులపైనే మూడు నెలలు కాలయాపన జరిగిందన్నారు.
అందువల్ల ఆశావాహులు ఎక్కువగా ఉన్న చోట కొంత ఆలస్యం జరిగినా పట్టు ఉన్న చోట్ల మాత్రం అభ్యర్థులను ప్రకటించాలని చెప్పబోతున్నట్లు తెలిపారు. పార్టీ సంస్థాగత విషయాలపై ప్రియాంక గాంధీతో చర్చిస్తానని ఈ భేటీ అనంతరం పార్టీలో తన పాత్ర ఏంటో తెలుసుకుని తన పాదయాత్రపై కార్యచరణ ప్రకటిస్తానన్నారు. సీడబ్ల్యూసీ పదవి విషయంలో తనకు లాబీయింగ్‌లు తెలియవని పదవి ఇస్తే ఉత్సాహంగా పని చేస్తానన్నారు. కాగా పీసీసీ పదవి తనను కాదని రేవంత్ రెడ్డికి ఇవ్వడంపై కోమటిరెడ్డి చాలా కాలంగా తన అసంతృప్తిని వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే