- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
కవిత పొలిటికల్ చాప్టర్ ఎప్పుడో క్లోజ్: MP అర్వింద్ కీలక వ్యాఖ్యలు
దిశ, వెబ్‌డెస్క్: పార్లమెంట్ ఎన్నికల్లో లబ్ది పొందేందుకు బీజేపీ సరిగ్గా ఎన్నికల ముందు లిక్కర్ స్కామ్ కేసులో కవితను అరెస్ట్ చేయించిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు ఎంపీ ధర్మపురి అర్వింద్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అరెస్ట్‌ను అడ్డుపెట్టుకోవడం లేదని.. కవిత అంశం బీజేపీకి చిన్న విషయమని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్సీ కవిత పొలిటికల్ చాప్టర్ ఎప్పుడో క్లోజ్ అయ్యిందని షాకింగ్స్ కామెంట్స్ చేశారు. పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీ మధ్యే పోటీ అని అన్నారు. లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి డిపాజిట్లు కూడా దక్కవని అర్వింద్ జోస్యం చెప్పారు. పసుపు బోర్డు ఏర్పాటుపై కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డి అసత్యాలు చెబుతున్నారని ఫైర్ అయ్యారు. పసుపు బోర్డు నిజామాబాద్‌లోనే ఏర్పాటు అవుతోందని మరోసారి క్లారిటీ ఇచ్చారు. పసుపు రీసెర్చ్ సెంటర్‌కు రూ.200 కోట్లు కేటాయించినట్లు తెలిపారు.