- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆ బిల్లు పాసయ్యాక KCR పాకిస్థాన్ పోవాల్సిందే: MP అరవింద్ కీలక వ్యాఖ్యలు
దిశ, వెబ్‌డెస్క్: ఎమ్మెల్యే సీతక్కను సీఎం చేస్తామంటూ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఎంపీ ధర్మపురి అరవింద్ స్పందించారు. సీఎం కాదు.. మొదటి సీతక్కను పీసీసీ చీఫ్ చేయగలరా అని ప్రశ్నించారు. దీనికి టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. అవసరమైతే కాదు.. సీతక్కను సీఎం చేస్తామని నమ్మకంగా ఎందుకుగా చెప్పలేదని నిలదీశారు. ఇక, కేంద్ర ప్రభుత్వం తీసుకువస్తోన్న యూసీసీ బిల్లుపై అర్వింద్ కీలక వ్యాఖ్యలు చేశారు. యూసీసీ బిల్లును పార్లమెంట్‌లో వ్యతిరేకిస్తామని బీఆర్ఎస్ చెబుతోందని.. అయితే, బీఆర్ఎస్ పార్టీ మద్దతు ఇవ్వకపోయిన యూసీసీ బిల్లు పార్లమెంట్‌లో పాస్ అవుతోందని కీలక వ్యాఖ్యలు చేశారు. ఉభయ సభల్లో యూసీసీ బిల్లు పాస్ అయ్యాక సీఎం కేసీఆర్ పాకిస్థాన్ పోవాల్సిందేనని ఎద్దేవా చేశారు. ముస్లిం ఓట్లు గంపగుత్తగా కాంగ్రెస్‌కు పడతాయన్న భయం కేసీఆర్‌లో మొదలైందని.. అందుకే ముస్లిం మతపెద్దలతో సీఎం భేటీ అయ్యారని ఆరోపించారు.