- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
MP Chamala: అల్లుఅర్జున్ అరెస్ట్‌తో రేవంత్ రెడ్డి పాన్ ఇండియా సీఎం అయ్యారు: ఎంపీ చామల కిరణ్
దిశ, డైనమిక్ బ్యూరో: పాన్ ఇండియా స్టార్ (Allu Arjun) అరెస్ట్‌తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth) పాన్ ఇండియా సీఎం అయ్యారని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి (MP Chamala Kiran Kumar Reddy) హాట్ కామెంట్స్ చేశారు. గురువారం ఆయన గాంధీభవన్‌లో మీడియాతో చిట్ చాట్‌లో మాట్లాడారు. కొంత మంది సీఎంలు అవినీతి చేసి అందరికీ తెలిశారని, కానీ సీఎం రేవంత్ రెడ్డి సాహసోపేత నిర్ణయాలు తీసుకొని అందరికీ తెలిశారని చెప్పుకొచ్చారు. ఇక రీజినల్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ మార్చి రైతులను మోసం చేయాలని (BRS) బీఆర్ఎస్ ప్లాన్ వేసిందని ఆరోపించారు. దోచుకుని, దాచుకునే అలవాటు (Congress) కాంగ్రెస్ పార్టీకి లేదన్నారు. (RRR) ఆర్ఆర్ఆర్ రూ.7 వేల కోట్ల ప్రాజెక్ట్ అయితే అందులో రూ.12 వేల కోట్ల అవినీతి జరిగిందని కేటీఆర్ ఆరోపిస్తున్నాడని మండిపడ్డారు.
కేటీఆర్ (KTR) పిచ్చి మాటలు చూస్తుంటే అతన్ని భయం వెంటాడుతోందని అర్థమవుతుందని విమర్శించారు. బీఆర్ఎస్ పార్టీ లాగా కాంగ్రెస్ పార్టీ తప్పుడు కేసులు బనాయించదన్నారు. కేటీఆర్, హరీష్ రావు, కవిత లు కావాలనే ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నారని అన్నారు. (Formula E- Race Case) ఫార్ములా ఈ రేస్ కేసులో కేటీఆర్ ఒక్కో రోజు ఒక్కోలా మాట్లాడుతున్నారని అన్నారు. కేటీఆర్ తప్పు చేస్తే ఖచ్చితంగా జైలుకు వెళ్తారని స్పష్టం చేశారు. ఈ కేసులో కేటీఆర్ నిర్దోషి కావాలని కోరుకుంటున్నామని, కానీ ఆయన తప్పు చేసినట్లు తేలిందని వివరించారు.