- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రతిపక్షాలపై కేసీఆర్ సైబర్ ఎటాక్.. MP బండి సెన్సేషనల్ కామెంట్స్
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ స్టేట్ పాలిటిక్స్‌లో ఫోన్ ట్యాపింగ్ కేసు పెను దుమారం రేపుతోంది. ఈ కేసులో అరెస్ట్ అయిన మాజీ టాస్క్‌ఫోర్స్ డీసీపీ రాధాకిషన్ రావు ఇచ్చిన వాంగ్మూలం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో ప్రతిపక్ష నేతలు రేవంత్ రెడ్డి, బండి సంజయ్, ఈటల రాజేందర్, ధర్మపురి అర్వింద్‌తో పాటు పలువురి ఫోన్లు ట్యాపింగ్ చేశామని కస్టడీలో రాధాకిషన్ రావు చెప్పినట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో ఫోన్ ట్యాపింగ్ కేసుపై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పదేళ్లు అధికారంలో ఉన్న కేసీఆర్ ప్రతిపక్షాలపై సైబర్ దాడి చేశారని సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఈ కేసులో అరెస్ట్ అయిన మాజీ డీసీపీ రాధాకిషన్ రావు ఇచ్చిన కన్ఫెషన్ రిపోర్టే దీనికి నిదర్శనమని అన్నారు. దేశ భద్రతకు సంబంధించిన ఫోన్ ట్యాపింగ్‌ను సొంత ప్రయోజనాల కోసం వాడుకున్న కేసీఆర్ ఏ పదవికి అర్హుడు కాదని మండిపడ్డారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్‌ను ఎందుకు అరెస్ట్ చేయడం లేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. సీఎం రేవంత్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే ఫోన్ ట్యాపింగ్ కేసును కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ చేత విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. కేసీఆర్, కేటీఆర్‌ను అరెస్ట్ చేసి విచారించాలని ప్రభుత్వాన్ని కోరారు.