- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పరీక్షలు కూడా నిర్వహించడం చేతగాని దద్దమ్మ సర్కార్: బీఆర్ఎస్‌పై బండి ఫైర్
దిశ, తెలంగాణ బ్యూరో: టెట్ పరీక్ష సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఒక ప్రశ్నాపత్రం బదులుగా మరో ప్రశ్నాపత్రం అందజేసి నిరుద్యోగులను తీవ్ర మానసిక క్షోభకు గురిచేయడం క్షమించరాని నేరమని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ విమర్శలు చేశారు. పరీక్షలు నిర్వహించడం చేతగాని దద్దమ్మ సర్కార్ అని శుక్రవారం ఒక ప్రకటనలో బండి ఫైరయ్యారు. టీఎస్ పీఎస్సీ పేపర్ లీకేజీ, టెన్త్ పేపర్ లీకేజీతోనే లక్షలాది మంది నిరుద్యోగులు, విద్యార్థులు తీవ్రంగా నష్టపోయారని, ఈ ఉదంతం మరువకముందే టెట్ ప్రశ్నాపత్రం మార్పు పేరుతో నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతున్నారని మండిపడ్డారు. నిత్యం ప్రతిపక్షాలపై బురద చల్లుతూ రాజకీయ పబ్బం గడుపుకునే ట్విట్టర్ టిల్లు సొంత జిల్లాలో అధికారులు చేసిన నిర్వాకంపై ఎందుకు నోరు మెదపడం లేదని ప్రశ్నించారు. తక్షణమే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవడంతోపాటు ఇలాంటివి పునరావృతం కాకుండా ఏర్పాట్లు చేయాలని డిమాండ్ చేశారు.