- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
కేంద్రం నిర్ణయంపై అసదుద్దీన్ ఒవైసీ సీరియస్
దిశ, వెబ్‌డెస్క్: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ నిర్ణయంపై ఎమ్ఐఎమ్ పార్టీ చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ఆగ్రహం వ్యక్త చేశారు. వక్ఫ్‌బోర్డు సవరణ బిల్లుకు కేంద్రం సన్నహాలు చేస్తోందని కీలక వ్యాఖ్యలు చేశారు. కేబినెట్‌లో భేటీలో 40 సవరణలు ప్రతిపాదించిందని అన్నారు. వక్ఫ్‌బోర్డు ఆస్తులను లాక్కునే ప్రయత్నం జరుగుతోందని అనుమానం వ్యక్తం చేశారు. తాము బిల్లును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు. పార్లమెంట్ జరుగుతున్నప్పుడు బిల్లుపై లీకులిచ్చి కేంద్రం సభా హక్కుల ఉల్లంఘనకు పాల్పడిందని అన్నారు. కాగా, వక్ఫ్ బోర్డుకు సుమారు 9.4 లక్షల ఎకరాల భూమి ఉందని తెలిపారు. వక్ఫ్ ఆస్తులకు బీజేపీ మొదటి నుంచి వ్యతిరేకంగానే ఉందని అన్నారు. వారికి హిందూత్వ అజెండా ఉందని.. వక్ఫ్ బోర్డు స్వయంప్రతిపత్తిని హరించేందుకు ప్రధాని మోడీ ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. దేశంలో వక్ఫ్ బోర్డును చాలా చోట్ల దర్గాలు ఉన్నాయని అన్నారు. ఇప్పుడు వారి చేతికి బోర్డు చిక్కితే నాశనం చేస్తారని అన్నారు.