Delhi liquor case : ‘దేశం ముందు తెలంగాణ సిగ్గుతో తలవంచుతోంది’

by GSrikanth |   ( Updated:2023-03-08 10:32:11.0  )
Delhi liquor case : ‘దేశం ముందు తెలంగాణ సిగ్గుతో తలవంచుతోంది’
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వ్యాఖ్యలపై బీజేపీ నేత, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ ఫైర్ అయ్యారు. తెలంగాణ ఉద్యమాల్లోను రాష్ట్ర ప్రభుత్వం ఎన్నడు తలవంచలేదు, కానీ ఇప్పుడు ఢిల్లీ లిక్కర్ స్కాంలో మీ ప్రమేయం వల్ల దేశం ముందు తొలిసారి తెలంగాణ సిగ్గుతో తలవంచుతోందని ఎమ్మెల్సీ కవిత వ్యాఖ్యలపై అర్వింద్ విమర్శలు గుప్పించారు. లిక్కర్ స్కాం తెరమీదకు రాగానే మహిళా రిజర్వేషన్ బిల్లు డ్రామాలు మోదలుపెట్టారని సెటైర్లు వేశారు. కేసీఆర్ ప్రభుత్వం 2014-2018 వరకు ఆయన కేబినెట్‌లో ఒక్క మహిళ కూడా లేదని గుర్తుచేశారు.


అప్పుడు నిజామాబాద్ ఎంపీగా ఉన్న కవిత..పార్టీలో ఆమె ఆధిపత్యం వల్లే కేబినెట్‌లో మహిళలకు చోటుదక్కలేదని ఆరోపించారు. ఈ నేపథ్యంలో 2019 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిపై పోటీ చేసి ఓడిపోయిందని, తదనంతరం నెపోటిజం కోటాలో ఎమ్మెల్సీ అయ్యి, ఇప్పుడు ఢిల్లీ లిక్కర్ స్కాంలో కీలక కుట్రదారుగా వ్యవహరించారని విమర్శించారు. దీంతో, హఠాత్తుగా మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం పోరాడేందుకు సిద్ధమయ్యారన్నారు. కానీ, ప్రజల దృష్టిని మరల్చడానికి కవిత చేసిన ప్రయత్నం వ్యర్థమైందని అర్వింద్ సెటైర్లు వేశారు.

Advertisement

Next Story

Most Viewed