Delhi Liquor scam case : ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో ఎంపీ అరెస్ట్

by Sathputhe Rajesh |   ( Updated:2023-10-04 12:22:44.0  )
Delhi Liquor scam case : ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో ఎంపీ అరెస్ట్
X

దిశ, వెబ్‌డెస్క్: ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. లిక్కర్ స్కామ్ కేసులో మరో అరెస్ట్ చోటు చేసుకుంది. ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ ను ఈడీ అరెస్ట్ చేసింది. కాగా ఆప్ నేత ఇంట్లో ఈ రోజు ఈడీ సోదాలు నిర్వహించింది. మనీ లాండరింగ్ కేసుతో సంబంధం ఉందన్న అనుమానంతో ఇంట్లో తనిఖీలు చేసింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసుతో సంబంధాలు ఉన్న బిజినెస్ మెన్ దినేష్ అరోరాతో సంజయ్ కి పరిచయాలు ఉన్నట్లు ఈడీ గుర్తించింది. అయితే ఈడీ దాడులను ముందే పసిగట్టిన సంజయ్ సింగ్ ‘ఈడీకి స్వాగతం’ అంటూ ఫ్లెక్సీ ఏర్పాటు చేయడం గమనార్హం.

Advertisement

Next Story