- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఫోర్జరీ సంతకాలతో రూ. 55 కోట్లు బురిడీ.. సినీ హీరో అరెస్ట్
దిశ, డైనమిక్ బ్యూరో: చీటింగ్ కేసులో సినీ హీరో నవీన్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. ఇండస్ట్రీలో హీరోగా చెలామణీ అవుతూ మోసాలకు పాల్పడుతున్న నవీన్ రెడ్డిని హైదరాబాద్ సీసీఎస్ అదుపులోకి తీసుకున్నారు. ఎస్ స్క్వేర్ కంపెనీలో డైరెక్టర్‌గా పనిచేసిన నవీన్ రెడ్డి.. కంపెనీ సహా డైరెక్టర్లకు తెలియకుండా కంపెనీ ఆస్తులు తాకట్టు పెట్టాడు. ఫోర్జరీ సంతకాలు చేసి కంపెనీ ఆస్తులను తన పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ మేరకు రూ. 55 కోట్లు మోసం చేసినట్లు ఎస్ స్క్వేర్ కంపెనీ డైరెక్టర్లు నవీన్ రెడ్డిపై ఫిర్యాదు చేశారు. దీంతో, నవీన్ రెడ్డిపై 420, 465, 468, 471, r/w 34 IPC సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. కేసు నమోదు చేసి విచారించిన పోలీసులు నవీన్‌ను చర్లపల్లి జైలుకు రిమాండ్ తరలించారు. కాగా మోసం చేసిన డబ్బులతో నవీన్ జల్సాలు చేశాడని బాధితులు చెబుతున్నారు. అలాగే తనే హీరోగా 'నోబడీ'అనే సినిమా కూడా తీశాడు. కాగా, నవీన్‌రెడ్డిపై గతంలో బైక్ దొంగతనం కేసులు కూడా ఉన్నాయి. కాగా, నవీన్ స్వగ్రామం సూర్యాపేట జిల్లా, నడిగూడెం మండలం కోడిపుంజులగూడెం కావడం గమనార్హం.
READ MORE