- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
సీఎం రేవంత్ తో సినీ ప్రముఖులు.. దిల్ రాజు పాత్ర ఏమిటి?
దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక సీఎంతో, మంత్రులతో సినీ ప్రముఖుల పలకరింపులు ఎక్కువ అయ్యాయి. ఇప్పటికే పలు దఫాలు సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డితో పాటు సీఎం రేవంత్ రెడ్డిని టాలివుడ్ ప్రముఖులు కలిసి తమ సమస్యల గురించి విన్నవించుకోగా.. సమస్యలకు పరిష్కారం చూపిస్తామని, సినీ పరిశ్రమను అన్ని విధాల ఆదుకుంటామని హామీ ఇచ్చారు. తాజాగా తెలుగు ఫిలిం చాంబర్ సభ్యులతో పాటు నిర్మాతల మండలి సభ్యులు సహా పలువురు టాలీవుడ్ సీనీ ప్రముఖులు రేవంత్ రెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా సీఎం కి పుష్పగుఛ్చం ఇచ్చి అభినందనలు తెలియజేశారు. అనంతరం జరిగిన సమావేశంలో సినిమా రంగం గురించి, వారి సమస్యల గురించి చర్చించినట్లు తెలిసింది. తెలుగు చిత్ర పరిశ్రమకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చినట్లు తెలిసింది.
ఇదిలా ఉండగా సీఎం రేవంత్ రెడ్డి సినీప్రముఖులు కలిసిన ప్రతి సమావేశంలో నిర్మాత దిల్ రాజు ప్రత్యేక ఆకర్షణగా కనిపిస్తున్నారు. దీనికి కారణం సినీ సమస్యల పరిష్కారం కోసమేనా..? లేక ఇందులో రాజకీయ కోణం ఏదైనా ఉందా.. అనేది చర్చనీయాంశంగా మారింది. కాగా సినీ నిర్మాత దిల్ రాజు అసెంబ్లీ ఎన్నికల ముందే రాజకీయాల్లోకి వస్తారని, ఎమ్మెల్యేగా పోటీ చేస్తారని పలు వార్తలొచ్చాయి. తాజా పలకరింపులతో దిల్ రాజు కాంగ్రెస్ నుంచి ఏదైనా పదవి ఆశిస్తున్నారా అని సినీ వర్గాలు చర్చించుకుంటున్నాయి.