అంబేద్కర్ భవనాన్ని వినియోగించే అవకాశం కల్పించండి

by Sridhar Babu |
అంబేద్కర్ భవనాన్ని వినియోగించే అవకాశం కల్పించండి
X

దిశ, ఆదిలాబాద్ : అన్ని విధాలుగా ఆర్థికంగా అందరికంటే వెనుక బడి ఉన్న తమకు అంబేద్కర్ భవనంలో అప్పుడప్పుడు కూర్చోవడానికి అవకాశం ఇవ్వాలని కొలం సేవ సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు కొడప సోనే రావు అన్నారు. ఈ మేరకు గురువారం సంఘం ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఆదివాసీ గ్రామాల్లో నివసిస్తున్న కొలం ప్రజలు జిల్లా కేంద్రానికి ఏదైనా పని నిమిత్తం వస్తే ఉండటానికి సౌకర్యం లేదన్నారు. కనీసం సమావేశం ఏర్పాటు చేసుకోవడానికి అనువైన ప్రదేశం లేదని తెలిపారు. అందుకు తమకు అంబేద్కర్ భవనంలో సమావేశం ఏర్పాటు చేసుకునేందుకు అవకాశం కల్పించాలని కోరారు. ఇందులో జిల్లా వ్యాప్త కొలం సంఘం ప్రజలు పాల్గొన్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం అందజేశారు.

Advertisement

Next Story