- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఉద్యమం కొనసాగుతుంది.. కేటీఆర్‌తో భేటీ అనంతరం వీఆర్ఏ జేఏసీ వెల్లడి
దిశ, తెలంగాణ బ్యూరో: ప్రభుత్వం వీఆర్ఏలకు సానుకూలంగా జీవో ఇచ్చి, సమస్యలను పరిష్కరించే అంతవరకు ఉద్యమం కొనసాగిస్తామని వీఆర్ఏ జేఏసీ స్పష్టం చేసింది. అసెంబ్లీ మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. పే స్కేల్, అర్హత కలిగిన వారికి ప్రమోషన్స్, ప్రభుత్వం ఇచ్చిన హామీ నెరవేర్చే వరకూ శాంతియుతంగా నిరసన కొనసాగిస్తామని తెలిపారు. కేసీఆర్ వీఆర్ఏలకు హామీలు ఇచ్చి రెండేళ్లు అయిందని అయినా పరిష్కరించకపోవడంతోనే నిరసన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టామని తెలిపారు. ఈనెల 20 లోపు సమస్యను పరిష్కరిస్తామని కేటీఆర్ హామీ ఇచ్చారని అప్పటివరకు.. ఉద్యమం కొనసాగుతునే ఉంటుందన్నారు. వీఆర్ఏల నిరసనలో 50 రోజులకు పూర్తి కావడంతో అసెంబ్లీ ముట్టడి చేపట్టామన్నారు. వీఆర్ఏలకు జాబ్ కార్డులో లేని పనులు కూడా కేటాయించాలని ఆయన పని భారంతో చేశామని తెలిపారు. రాష్ట్రంలోని 23 వేల మందికి పే స్కేల్ వర్తింపచేయాలని డిమాండ్ చేశారు. శేషాద్రి కమిటీ రిపోర్టు ప్రకారం వీఆర్ఏల సమస్యలను పరిష్కారానికి సీఎస్‌కు సూచించినట్లు తెలిపారు. రిపోర్టు ప్రకారం కేటీఆర్ ఆధ్వర్యంలో చేస్తామని హామీ ఇచ్చినట్లు నేతలు పేర్కొన్నారు. అరెస్టు చేసిన వీఆర్ఏలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. జేఏసీ నాయకులు దాదా అన్నయ్య, మహమ్మద్ రఫీ, వెంకటేష్ యాదవ్, వంగూరు రాము, బందే రాజు, కామెర నారాయణ, రాజప్ప, వీరన్న, శ్రీనివాస్, వెంకటేష్, అజీజ్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు.