వివాహేతర సంబంధం.. జగిత్యాలలో కన్న పిల్లలను వదిలేసి వెళ్లిన ఓ తల్లి

by Ramesh N |
వివాహేతర సంబంధం.. జగిత్యాలలో కన్న పిల్లలను వదిలేసి వెళ్లిన ఓ తల్లి
X

దిశ, డైనమిక్ బ్యూరో: బిడ్డలకు తల్లి ఏ కష్టం రాకుండా కాపాడుంది. కానీ వివాహేతర సంబంధం పెట్టుకున్న ఓ మహిళ తాను తల్లి అనేది మర్చిపోయింది. కన్న పిల్లలను ప్రభుత్వ ఆసుపత్రిలో వదిలేసి ఎస్కేప్ అయింది. జగిత్యాల జిల్లాలకు సంబంధించిన ఈ షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. జగిత్యాల జిల్లా మల్లాపూర్ మడలం సాతరం గ్రామానికి చెందిన నరేష్‌తో దివ్యకు వివాహం అయింది. కాగా ఇటీవల రోడ్డు ప్రమాదంలో నరేష్ మృతి చెందాడు. దీంతో వేరే వారితో వివాహేతర సంబంధం పెట్టుకొని పిల్లలను తల్లి దివ్య వదిలేసి వెళ్లిపోయింది. అయితే అనారోగ్యంతో (government hospital) ప్రభుత్వ ఆసుపత్రిలో దివ్య తండ్రి మురళి చేరాడు. ఈ క్రమంలోనే తండ్రిని చూడడానికి వచ్చి దివ్య ఆయనతో గోడవపడి ఇద్దరు పిల్లలు వదేలేసి వెళ్లిపోయిందని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. దీంతో పిల్లలు అమ్మమ్మ తాత వద్దనే ఉంటున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

Next Story