అంగన్ వాడీ కేంద్రాలకు మరింత నాణ్యమైన ఆహారం : మంత్రి సీతక్క

by M.Rajitha |
అంగన్ వాడీ కేంద్రాలకు మరింత నాణ్యమైన ఆహారం : మంత్రి సీతక్క
X

దిశ, వెబ్ డెస్క్ : త్వర‌లో అంగ‌న్ వాడీల్లో న‌ర్సరీ స్కూల్లను ప్రారంభిస్తామని మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క(Seethakka) ప్రకటించారు. అంగ‌న్ వాడీ కేంద్రాల‌కు నాణ్యమైన‌, పోషకార ఆహారం అందించాలని పేర్కొన్నారు. తెలంగాణ ఫుడ్స్ త‌యారీ కేంద్రాల‌ నుంచి అంగ‌న్ వాడీ కేంద్రాలకు స‌కాలంలో స‌ర‌ఫ‌రా జ‌ర‌గాలన్నారు. ఆల‌స్యంగా స‌ర‌ఫరా చేసే ట్రాన్స్ పోర్టర్లపై కఠిన చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. పిల్లల‌కు పోష‌కారం అందేలా ఎప్పటికప్పుడు అధికారులు మానిట‌రింగ్ చేయాలని, ఆయిల్, పప్పులు, బాల‌మృతం, ఆహ‌ర ప‌దార్ధాలు బాగుండేలా చూడాలన్నారు. ఎదిగే వ‌య‌సులో చిన్నారుల‌కు మంచి పోషకాల‌ను అందించి, తద్వారా మాల్ న్యూట్రిషన్ బారి నుండి పిల్లలను కాపాడాలన్నారు. అంగన్ వాడీ కేంద్రాలకు సరఫరా చేసే పదార్థాల ధ‌ర‌ల స‌వ‌ర‌ణ కోసం క‌మిటీ వేస్తున్నట్టు తెలిపారు. ఫైనాన్స్ శాఖ‌, మ‌హిళా శిశు సంక్షేమ శాఖ‌, తెలంగాణ ఫుడ్స్ అధికారుల‌తో త్రిమెన్ క‌మిటి వేస్తున్నాం. టెండ‌ర్లు, సంప్లయర్ల ఎంపికలో మ‌రింత పార‌ద‌ర్శక‌త పెర‌గాలని ఈ సందర్భంగా సీతక్క తెలియ జేశారు.

Advertisement

Next Story

Most Viewed