కార్మిక హక్కులను కాలరాస్తున్న మోడీ : చాడ వెంకట్ రెడ్డి

by Vinod kumar |
కార్మిక హక్కులను కాలరాస్తున్న మోడీ : చాడ వెంకట్ రెడ్డి
X

దిశ, తెలంగాణ బ్యూరో: నూతన చట్టాల ద్వారా మోడీ ప్రభుత్వం కార్మికుల హక్కులను కాలరాస్తున్నారని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకట్ రెడ్డి విమర్శించారు. మంగళవారం మగ్ధుం భవన్ లో భారీగా రవాణా రంగ కార్మిక సంఘాల జేఏసీ అధ్యక్షుడు బైరగోని రాజు గౌడ్ నేతృత్వంలో రవాణా రంగ కార్మికులు పార్టీలోకి చేరారు. చాడ వెంకట్ రెడ్డి అందరికి ఎర్ర కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఎర్ర జెండాకు ఘనమైన చరిత్ర ఉందన్నారు. ఈ సందర్భంగా చాడా మాట్లాడుతూ.. అనేక ప్రజా ఉద్యమాలు నిర్వహించి ప్రజా సమస్యలు పరిష్కారం చేసిన, పేద బడుగు బలహీన వర్గాల హక్కుల కోసం నిరంతరం పనిచేస్తున్న ఘనత ఎర్ర జెండాకు దక్కిందని తెలిపారు.

అణగారిన వర్గాల ఆశాజ్యోతి ఎర్ర జెండా అని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా జ్యోతిరావు పూలే 197 వ జయంతి సందర్భంగా సీపీఐ రాష్ట్ర కార్యాలయం మఖ్దూంభవన్‌‌లో చాడా చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వి.ఎస్.బోస్, ఈ.టి. నరసింహ, ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి బి. వెంకటేశం, ఎస్. ఛాయాదేవి, యాదగిరి, బి. స్టాలిన్ పాల్గొన్నారు.

ఫూలే స్ఫూర్తితో మనువాదంపై బలమైన ఉద్యమం: చాడా, చెరుపల్లి

మహాత్మా జ్యోతిబా ఫూలే స్ఫూర్తితో మనువాదంపై బలమైన ఉద్యమం నిర్మించాలని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకట్ రెడ్డి, సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు చెరుపల్లి సీతారాములు పిలుపునిచ్చారు. ఆర్ఎస్ఎస్ బీజేపీ అనుసరిస్తున్న సిద్ధాంతం ఎంత ప్రమాదకరమో ప్రజల్లో చైతన్యం పెంపొందించాలని కోరారు. మంగళవారం జ్యోతిరావు పూలే 197వ జయంతి సందర్భంగా ‘మనువాదాన్ని మట్టు పెడదాం సామాజిక న్యాయాన్ని కాపాడుదాం’ అనే అంశంపై సీపీఐ, సీపీఎం రాష్ట్ర కమిటీల ఆధ్వర్యంలో సభను నిర్వహించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. 75 ఏళ్ల స్వతంత్ర భరత ఆజాదీ కా అమృత మహోత్సవాలు జరుగుతున్నా పేదలపై, అణగారిన వార్గాలపై వివక్ష పోలేదన్నారు. సామాజిక న్యాయం సాధించడమే లక్ష్యంగా ఐక్యంగా పనిచేయాలని వారు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఇండియన్ లాయర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి బొమ్మగాని ప్రభాకర్, సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఎన్ బాలమల్లేష్, సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు ఎంవి రమణ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed