- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మోడీ ఫోటోలకు మాకు అభ్యంతరం లేదు.. అసెంబ్లీలో భట్టి సంచలన వ్యాఖ్యలు
దిశ, డైనమిక్ బ్యూరో:కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధుల విషయంలో డిప్యూటీ సీఎం, ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు చేశారు. గురువారం అసెంబ్లీలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ పై సమాధానం ఇచ్చిన ఆయన.. బీజేపీ పక్ష నేత కేంద్రం నుంచి నిధులు తెచ్చుకోవాలని సూచించారని.. కేంద్రం నుంచి వచ్చే గ్రాంట్స్, నిధులు తెచ్చుకోవడానికి మా ప్రభుత్వంలో అన్ని ప్రయత్నాలు చేస్తామన్నారు. రాష్ట్రానికి ఎక్కువ నిధులు ఇచ్చేలా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాలని రాష్ట్ర బీజేపీ నేతలు ఒక మాట చెప్పి మాకు సహకరించాలన్నారు. కేంద్రం నుంచి వచ్చే స్కీమ్ కు ప్రధాన మంత్రి ఫోటో పెట్టేందుకు మాకు ఎలాంటి అభ్యతంరం లేదన్నారు. అలాగే రాష్ట్రాల నుంచి వచ్చే నిధులతో కేంద్రం అమలు చేసే స్కీమ్ లపై ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రుల ఫోటోలు పెడితే బాగుంటుందని సూచించారు.
కేసీఆర్ హయాంలో మోడీ ఫోటో కలెక్టర్ ను ప్రశ్నించిన నిర్మలా సీతారామన్:
గత కేసీఆర్ ప్రభుత్వంలో రేషన్ దుకాణంలో ప్రధాని మోడీ ఫోటో లేకపోవడంపై కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కలెక్టర్ ను ప్రశ్నించడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. 2022 సెప్టెంబర్ లో కామారెడ్డి జిల్లా బీర్కూర్ లో పర్యటించిన నిర్మలా సీతామన్ ఓ రేషన్ షాప్ ను పరిశీలించారు. రేషన్ షాప్ లో మోడీ ఫోటో లేకపోవడంపై అభ్యంతరం వ్యక్తం చేసిన ఆమె.. కోవిడ్ సమయంలో 2020 మార్చి నుంచి కేంద్రమే ఉచిత బియ్యం పంపిణీ చేస్తోందని రవాణా, గోదాం ఖర్చులను భరించి ప్రజలకు బియ్యాన్ని ఇస్తున్నప్పుడు రేషన్ దుకాణంలో ప్రధాని మోడీ ఫోటో పెట్టకపోవడం ఏంటని నాటి కామారెడ్డి కలెక్టర్ జితేష్ వి పాటిల్ ను ప్రశ్నించారు. ఈ వ్యవహారం అప్పట్లో రాజకీయంగా తీవ్ర దుమారం రేపింది. నిర్మలా సీతారామన్ వ్యాఖ్యలకు బీఆర్ఎస్ కౌంటర్ ఇచ్చిన సంగతి తెలిసిందే.
తాజాగా కేరళలో మోడీ ఫోటో పై రచ్చ:
రేషన్ షాపుల్లో ప్రధాని మోడీ పోస్టర్లు, బ్యానర్ల అంశంపై ఇటీవలే కేరళ సీఎం పినరయి విజయన్ హాట్ కామెంట్స్ చేశారు. రేషన్ షాపుల్లో పీఎం మోడీ పోస్టర్లు, బ్యానర్లు ఏర్పాటు చేయాలని కేంద్రం జారీ చేసిన ఆదేశాలు సరైనవి కాదని అన్నారు. వీటి అమలు పరచడం కష్టమన్న ఆయన కేరళలో రేషన్ వ్యవస్థ దీర్ఘకాలంగా ఉందని, గతంలో ఎన్నడూ లేని విధంగా మోదీ సర్కార్ నూతన ప్రచార పోకడను చేపట్టడం ఏంటని అభ్యంతరం తెలిపారు.