Mobile Phones: తెలంగాణ పోలీసుల ఘనత.. మొబైల్ రికవరీలో రాష్ట్రానికి రెండో స్థానం

by Shiva |
Mobile Phones: తెలంగాణ పోలీసుల ఘనత.. మొబైల్ రికవరీలో రాష్ట్రానికి రెండో స్థానం
X

దిశ, వెబ్‌డెస్క్: దేశ వ్యాప్తంగా మొబైల్ దొంగతనాలను అరికట్టేందుకు సెంట్రల్ ఎక్విప్‌మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ (CEIR) పోర్టల్‌ను ప్రవేశపెట్టారు. ఈ క్రమంలో తెలంగాణ పోలీసులు అరుదైన ఘనత సాధించారు. 2024 జనవరి 1 నుంచి 2024 జూలై 25 వరకు ఏడు నెలల నెలల వ్యవధిలోనే 21,193 మొబైల్ ఫోన్లను రికవరీ చేసి దేశంలో రెండో స్థానంలో నిలిచారు. 35,945 మొబైల్స్‌ను రికవరీ చేసిన కర్ణాటక రెండో స్థానంలో నిలిచింది. మహారాష్ట్ర 15,426, ఆంధ్రప్రదేశ్ 7,387 రికవరీలతో ఆ తరువాతి స్థానంలో ఉన్నాయి. రాష్ట్రంలో ఏప్రిల్ 19, 2023న పైలట్ ప్రాతిపదికన ప్రారంభించబడిన ఈ పోర్టల్ రాష్ట్రంలోని మొత్తం 780 పోలీస్ స్టేషన్లలో అమలు చేస్తున్నారు. ఇక జంట నగరాల్లోని మూడు కమిషనరేట్లలో రోజుకు సగటున 76 మొబైల్‌ ఫోన్లను పోలీసులు రికవరీ చేస్తుండటం విశేషం. 4,869 ఫోన్లు రికరవీ చేసి హైదరాబాద్ కమిషనరేట్ అగ్రస్థానంలో ఉంది. ఆ తరువాత స్థానాల్లో సైబరాబాద్ కమిషనరేట్ 3,078 ఫోన్లు, రాచకొండ కమిషనరేట్ 3,042లు ఉన్నాయి.

Advertisement

Next Story