- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో తెరపైకి ఎమ్మెల్సీ పాత్ర
దిశ, డైనమిక్ బ్యూరో:ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తులో సినిమాను మించిన ట్విస్టులు నమోదు అవుతున్నాయి. ఈ ఫోన్ ట్యాపింగ్ కు ఎస్ఐబీ కన్సల్టెంట్ రవిపాల్ సహకరించారని ఇజ్రాయేల్ నుంచి అత్యాధునిక పరికరాన్ని దిగుమతి చేసుకోవడంలో ఆయన సహకరించారని చర్చ జరుగుతున్న వేళ తాజాగా ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఓ ఎమ్మెల్సీ పాత్ర తెరమీదకు వస్తోంది. ఇజ్రాయిల్ పరికరాలు కొని హైదరాబాద్ కు రప్పించడంలో ఓ ఎమ్మెల్సీ కీలక పాత్ర పోషించారని.. తన పలుకుబడి ఉపయోగించి రవిపాల్ తో ట్యాపింగ్ డివైజ్ లను తెప్పించినట్లు సిట్ అధికారులు గుర్తించినట్లు తెలుస్తోంది. దీంతో సదరు ఎమ్మెల్సీని విచారించేందుకు సిట్ అధికారులు సిద్ధం అవుతున్నట్లు టాక్ వినిపిస్తోంది.
కాగా గతంలో రవిపాల్ ఎస్ఐబీ టెక్నికల్ కన్సల్టెంట్ గా వ్యవహరించారు. ఈ సమయంలో పెద్ద మొత్తంలో నిఘా పరికరాలను ఇజ్రాయెల్ నుంచి రప్పించారు. నిజానికి ఇలాంటి నిఘా పరికరాల వినియోగానికి కేంద్ర ప్రభుత్వం అనుమతి తప్పనిసరి అవసరం. అలా చేస్తే దిగుమతి చేసుకుంటున్న పరికారాలకు ప్రభుత్వం నుంచి నిధులు వెచ్చించాల్సి ఉంటుంది. దాంతో ఏయే పరికారాలు తెప్పించామో అనేది సులభంగా తెలిసిపోయే అవకాశం ఉండటంతో రవిపాల్ మాత్రం కేంద్ర ప్రభుత్వం అనుమతి లేకుండా ఇజ్రాయెల్ నుంచి ప్రత్యేకమైన పరికారాలను తెప్పించిటన్లు తెలుస్తోంది. అయితే ఈ విషయాన్ని గుట్టుగా ఉంచేందుకు రవిపాల్ ఓ సాఫ్ట్ వేర్ కంపెనీ పేరుతో ఇజ్రాయెల్ పరికరాలను తెప్పించి వాటిని సదరు ఎమ్మెల్సీకి అప్పగించగా ఆయన వాటిని మరో ప్రైవేట్ వ్యక్తికి అప్పగించడంతో ఆ మేరకు ఫోన్ ట్యాపింగ్ లు జరిగినట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో ఫోన్ ట్యాపింగ్ కేసులో సదరు ఎమ్మెల్యే ఎవరు? ఎవరి ఫోన్ ట్యాపింగ్ లు చేయడంలో సహకరించారు అనేది చర్చగా మారింది.