ఢిల్లీ లిక్కర్ స్కామ్: MLC కవిత మాజీ ఆడిటర్‌కు కస్టడీ పొడిగింపు

by Satheesh |
ఢిల్లీ లిక్కర్ స్కామ్: MLC కవిత మాజీ ఆడిటర్‌కు కస్టడీ పొడిగింపు
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఢిల్లీ లిక్కర్ కుంభకోణం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మాజీ ఆడిటర్ గోరంట్ల బుచ్చిబాబుకు కోర్టు కస్టడీ పొడిగించింది. ఈ కేసులో సీబీఐ ఫిబ్రవరి 8న బుచ్చిబాబును అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. నేటితో అతడి కస్టడీ ముగియడంతో శనివారం బుచ్చిబాబును సీబీఐ అధికారులు ఢిల్లీలోని రౌస్ ఎవెన్యూ కోర్టులో హాజరుపరిచారు. ఈ సందర్భంగా కేసు దర్యాప్తు పురోగతిని సీబీఐ అధికారులు కోర్టుకు వివరించి కస్టడీ పొడిగించాలని కోరారు. సీబీఐ వాదనతో అంగీకరించిన స్పెషల్ కోర్టు బుచ్చిబాబుకు 14 రోజుల కస్టడీ పొడిగిస్తూ ఈ కేసు విచారణ మార్చి 9కి వాయిదా వేసింది.

కాగా ఈ కేసులో బుచ్చిబాబు మద్యం విధానం కుట్రలో భాగస్వామి అని, సహా నిందితులతో కలిసి అనేక సమావేశాలకు హాజరయ్యారని.. ఇతడు తీవ్రమైన నేరాలకు పాల్పడ్డాడని సీబీఐ గతంలో కోర్టుకు తెలిపింది. అయితే ఈ కేసులో దర్యాప్తు సంస్థలు దూకుడు పెంచడంతో రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అవుతోంది. ముఖ్యంగా తెలంగాణలోని అధికార బీఆర్ఎస్ పార్టీలో ఈ కేసు పరిణామాలు తీవ్ర ఉత్కంఠ రేపుతున్నాయి.

Advertisement

Next Story

Most Viewed