రాహుల్ గాంధీపై MLC కవిత సెటైర్లు!

by Sathputhe Rajesh |   ( Updated:2023-10-18 07:21:26.0  )
రాహుల్ గాంధీపై MLC కవిత సెటైర్లు!
X

దిశ, వెబ్‌డెస్క్: రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటన వేళ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఆయనపై ఫైర్ అయ్యారు. రాహుల్ గాంధీ కాదు ఎన్నికల గాంధీ అన్నారు. రాహుల్ తెలంగాణకు వచ్చి మాకేం చెప్పాల్సిన పనిలేదన్నారు. తెలంగాణలో ఉన్నది బీసీల ప్రభుత్వం అన్నారు. బీఆర్ఎస్ మేనిఫెస్టో చూసి కాంగ్రెస్, బీజేపీల మైండ్ బ్లాంక్ అయిందన్నారు. తెలంగాణకు జాతీయ స్థాయి నేతలు క్యూ కడుతున్నారన్నారు. ప్రధాని మోడీ, రాహుల్ గాంధీ తెలంగాణలో అభివృద్ధి చూడాలన్నారు. తెలంగాణ పథకాలను అన్ని రాష్ట్రాలు అనుసరిస్తున్నాయన్నారు. తెలంగాణకు రండీ.. కానీ వాతావరణం రెచ్చగొట్టకండి అని సూచించారు. రాహుల్ గాంధీ నిజామాబాద్ కు స్వాగతిస్తున్నామని కవిత అన్నారు. ఇక్కడికి వచ్చి అంకాపూర్ చికెన్ తిని వెళ్లండి. డిచ్ పల్లి రామాలయాన్ని దర్శించండి అని కవిత అన్నారు.

Advertisement

Next Story

Most Viewed