- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
బ్రేకింగ్: మరోసారి ప్రగతి భవన్‌కు వెళ్లిన MLC కవిత..!

దిశ, వెబ్ డెస్క్: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో రేపు విచారణను ఎదుర్కొనున్న ఎమ్మెల్సీ కవిత మరోసారి ప్రగతి భవన్‌కు వెళ్లారు. ఈ కేసుకు సంబంధించి తండ్రి సీఎం కేసీఆర్‌తో చర్చలు జరపడానికి ఇప్పటికే రెండు సార్లు ప్రగతి భవన్‌కి వెళ్లిన కవిత.. సీబీఐ విచారణకు ఒక్కరోజు ముందు మరోసారి ప్రగతి భవన్‌కు వెళ్లడం హాట్ టాపిక్‌గా మారింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో విచారించేందుకు సీబీఐ 160 సీఆర్పీసీ కింద నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. డిసెంబర్ 6వ తేదీన విచారణకు హాజరు కావాలని సీబీఐ నోటీసుల్లో పేర్కొనగా.. వ్యక్తిగత పనుల వల్ల 6వ తేదీన విచారణకు అందుబాటులో ఉండనని కవిత సీబీఐ అధికారులకు లేఖ రాశారు. డిసెంబర్ 11, 12, 14, 15 తేదీల్లో విచారణకు అందుబాటులో ఉంటానని తెలిపారు. ఆమె అభ్యర్థన మేరకు ఈ నెల 11వ తేదీన విచారణకు అందుబాటులో ఉండాలని సీబీఐ ఆదేశించింది. ఈ నేపథ్యంలో రేపు హైదరాబాద్‌లోని కవిత నివాసంలో ఆమె స్టేట్‌మెంట్‌ను సీబీఐ అధికారులు రికార్డ్ చేయనున్నారు.