ఈటల రాజేందర్‌పై కౌశిక్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

by GSrikanth |
ఈటల రాజేందర్‌పై కౌశిక్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: హుజురాబాద్ బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌పై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. హుజురాబాద్ ఉప ఎన్నికల్లో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి ఈటల రూ.25 కోట్లు ఇచ్చారని కౌశిక్ రెడ్డి ఆరోపించారు. ఈ విషయాన్ని స్వయంగా ఈటలే చెబుతున్నారని గుర్తుచేశారు. బీజేపీలో ప్రాధాన్యత దక్కక ఈటల సహనం కోల్పోయి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఎన్నికలు సమీస్తున్నాయని కాంగ్రెస్, బీజేపీలు కొత్త నాటకానికి తెరలేపాయని విమర్శించారు. ఎన్నిరెన్ని కుట్రలు చేసినా రాబోయేది మళ్లీ బీఆర్ఎస్ సర్కానే అని జోస్యం చెప్పారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీలను నమ్మే పరిస్థితిలో రాష్ట్ర ప్రజలు లేరని స్పష్టం చేశారు.

Advertisement

Next Story