- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తెలంగాణలో నెంబర్ వన్ 420 కేసీఆర్: జీవన్ రెడ్డి
దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ రాష్ట్రంలో నంబర్ వన్ 420 ఎవరంటే కేసీఆర్ అని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి విమర్శించారు. ఎన్నికల్లో చేసిన వాగ్దాలనే అమలు చేయడం ప్రామాణికం అయితే కేసీఆర్ పెద్ద 420 అని మండిపడ్డారు. హైదరాబాద్‌లోని సీఎల్పీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. సమాజంలో అట్టడుగు వర్గాలు అయిన దళితులను మోసం చేసింది కేసీఆర్ అని, ఇక్కడి నుంచే మోసం మొదలైందన్నారు. 3 ఎకరాలు భూమి ఏమైంది..? అని గుర్తుచేశారు. ఎస్టీ రిజర్వేషన్లు, రాష్ట్ర పరిధిలో ఉన్న అంశంలో ఇందిరా సహాని కేసు అని 8 ఏళ్లు కాలయాపన చేశారని ఆరోపించారు.
టీఆర్ఎస్ నుంచి తెలంగాణ ఎప్పుడు అయితే తొలగించారో అప్పుడే తెలంగాణ అనే పదాన్ని ఉచ్చరించే హక్కు కోల్పోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ కేంద్రంలో తెచ్చిన ప్రతి చట్టానికి మద్దతు ఇచ్చారని అన్నారు. ఎమ్మెల్సీ కవితను ఏవిధంగా కాపాడారో కేసీఆర్ కూడా అలానే కాపాడుదాం అనుకుంటున్నవా..? కిషన్ రెడ్డి అని నిలదీశారు. ముందు మీ సీటు చూసుకో అని కిషన్ రెడ్డిని విమర్శించారు. కేసీఆర్ కమీషన్ వల్లే తెలంగాణ లక్ష కోట్ల అప్పుల్లో కూరుకు పోయిందని, జ్యూడిషరీ ఎంక్వయిరీ పారదర్శకంగా జరుగుతుందన్నారు.