MLA Yennam: బీఆర్ఎస్ పార్టీ నాలుగు ముక్కలుగా విడిపోయింది: ఎమ్మెల్యే యెన్నం ఘాటు వ్యాఖ్యలు

by Shiva |
MLA Yennam: బీఆర్ఎస్ పార్టీ నాలుగు ముక్కలుగా విడిపోయింది: ఎమ్మెల్యే యెన్నం ఘాటు వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరెకపూడి గాంధీని (MLA Arekapudi Gandhi) పీఏసీ చైర్మన్‌ (PAC Chairman)గా నియమించిన నాటి నుంచి రాష్ట్రంలో అధికార, ప్రతిపక్ష పార్టీల నడుమ మాటల యుద్ధం కొనసాగుతోంది. పదేళ్ల పాలనలో రాష్ట్రంలో అన్ని రంగాలను గత ప్రభుత్వం భ్రష్టు పట్టించారని కాంగ్రెస్ (Congress) నాయకులు బీఆర్ఎస్‌ (BRS) పార్టీపై వరుసగా విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌‌రెడ్డి (MLA Yennam Srinivas Reddy) బీఆర్ఎస్‌పై మరోసారి ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్ (BRS) పార్టీ ఇప్పటికే నాలుగు ముక్కలుగా విడిపోయిందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

పీఏసీ చైర్మన్ (PAC Chairman) పదవికి నలుగురిలో అరెకపూడితో ఎవరు నామినేషన్ వేయించారో చెప్పాలన్నారు. పీఏసీ ఔన్నత్యాన్ని తగ్గించేందుకు గులాబీ పార్టీ నాయకులు కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. అరెకపూడి గాంధీ పీఏసీ చైర్మన్ అవ్వడం ఆ పార్టీ జీర్ణించుకోలేకపోతోందని ఫైర్ అయ్యారు. రూల్స్ ప్రకారమే చైర్మన్ నియామకం జరిగిందని స్పష్టం చేశారు. అసెంబ్లీ (Assembly)లో సీనియర్ శాసనసభ్యుడైన అరెకపూడిని పీఏసీ చైర్మన్ చేయడం తప్పా అని ప్రశ్నించారు. పీఏసీ సమావేశంలో కూడా స్పీకర్‌పై బీఆర్ఎస్ నాయకులు ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడారని ధ్వజమెత్తారు. గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో పీఏసీని తుంగలో తొక్కి ప్రభుత్వం ఖర్చుల విధ్వంసానికి పాల్పడిందని ఆరోపించారు. త్వరలోనే అందరి లెక్కలు బయటకు వస్తాయని యెన్నం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు.

Next Story

Most Viewed