- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పేరు మార్చిన నో ప్రాబ్లమ్.. ఆ స్కీమ్ కొనసాగించండి: ప్రభుత్వానికి MLA శ్రీహరి విజ్ఞప్తి
దిశ, వెబ్‌డెస్క్: గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన దళిత బంధు స్కీమ్‌ను తాజాగా తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కార్ హోల్డ్‌లో పెట్టినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో దళిత బంధు స్కీమ్‌పై బీఆర్ఎస్ సీనియర్ నేత, ఎమ్మెల్యే కడియం శ్రీహరి కీలక వ్యాఖ్యలు చేశారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రారంభించిన దళిత బంధు పథకాన్ని కొనసాగించాలని కాంగ్రెస్ సర్కార్‌ను కోరారు. ఆ స్కీమ్ పేరు మార్చిన పర్వాలేదని.. దళితులకు మాత్రం ఆర్థిక సహయం ఆగొద్దని అన్నారు.
దళిత బంధు స్కీమ్‌లో అక్రమాలకు పాల్పడ్డ వస్తున్న వార్తలపైన శ్రీహరి రియాక్ట్ అయ్యారు. ఈ స్కీమ్ పంపిణీలో అక్రమాలకు పాల్పడని వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోండని.. కానీ దళితులకు ఆర్ధిక సాయం చేసేందుకు బీఆర్ఎస్ తీసుకువచ్చిన దళిత బంధు స్కీమ్‌ను మాత్రం కొనసాగించాలన్నారు. లబ్ధిదారులకు సాయం ఆపొద్దని ఈ సందర్భంగా శ్రీహరి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. కాగా, గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రారంభించిన గృహలక్ష్మీ, గొర్రెల పంపిణీ వంటి స్కీమ్‌లను ఇప్పటికే కాంగ్రెస్ సర్కార్ రద్దు చేసిన విషయం తెలిసిందే.