భువనగిరిలో చామల భారీ మెజార్టీ సాధిస్తారు: కాంగ్రెస్ MLA

by GSrikanth |
భువనగిరిలో చామల భారీ మెజార్టీ సాధిస్తారు: కాంగ్రెస్ MLA
X

దిశ, వెబ్‌డెస్క్: చామల కిరణ్ కుమార్ రెడ్డికి భువనగిరి పార్లమెంట్ టికెట్ కేటాయించడంపై తుంగతుర్తి కాంగ్రెస్ ఎమ్మెల్యే మందుల సామేలు స్పందించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చామలకు టికెట్ ఇవ్వడం శుభపరిణామం అని అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా అధిష్టానానికి కృతజ్ఞతలు చెప్పారు. గత 20 సంవత్సరాలుగా పార్టీకి కిరణ్ కుమార్ రెడ్డి సేవ చేశారని గుర్తుచేశారు. భువనగిరిలో కాంగ్రెస్‌ పార్టీ బంపర్ మెజార్టీతో గెలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కాగా, బుధవారం రాత్రి కాంగ్రెస్ అభ్యర్థుల ఎనిమిదో జాబితాను పార్టీ హైకమాండ్ విడుదల చేసింది.

ఈ జాబితాలో మొత్తం 14 అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. జార్ఖండ్, మధ్యప్రదేశ్, తెలంగాణ, ఉత్తరప్రదేశ్ స్థానాలకు సంబంధించి మొత్తం నాలుగు రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులను ప్రకటించారు. ఇక తెలంగాణలో ఉన్న మొత్తం 17 స్థానాలకు గాను ఇప్పటికే 9 సీట్లలో అభ్యర్థులను ఖరారు చేయగా.. తాజాగా మరో నలుగురితో జాబితాను ప్రకటించింది. నిజామాబాద్- తాటిపర్తి జీవన్ రెడ్డి, ఆదిలాబాద్(ఎస్టీ)- డాక్టర్ సుగుణ కుమారి, మెదక్- నీలం మధు, భువనగిరి- చామల కిరణ్ కుమార్ రెడ్డిని ఖరారు చేసింది.

👉 Download our Android App
👉Download our IOS App
👉Follow us on Instagram
👉 Follow us on whatsApp channel
👉 Follow us on Share chat

Next Story

Most Viewed