- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ప్రజల తరపున మాట్లాడటమే నరేందర్ రెడ్డి చేసిన తప్పా: సబితా ఇంద్రారెడ్డి
దిశ, వెబ్ డెస్క్: ప్రజల తరపున మాట్లాడమే నరేంద్ రెడ్డి చేసిన తప్పా అని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి(Former minister and BRS MLA Sabitha Indra Reddy) అన్నారు. నరేందర్ రెడ్డి భార్యను ఆమె పరామర్శించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి(Former MLA Narendra Reddy) అరెస్ట్‌పై సబిత స్పందించారు. నరేందర్ రెడ్డి రైతుల కోసం పోరాటం చేశారని తెలిపారు. బీఆర్ఎస్ నేతల అరెస్ట్ కొత్తేంకాదున్నారు. అధికారులపై జరిగిన దాడి బాధాకరమన్నారు. లగచర్లలో నరేందర్ రెడ్డి చేసిన తప్పేంటన్ని ప్రశ్నించారు. ఫార్మా నిర్వాసితులకు భరోసా కల్పించడకుండా నరేందర్ రెడ్డిని బాధ్యుడిని చేస్తున్నారని సబిత మండిపడ్డారు.
భూములు పోతున్న రైతులకు నరేందర్ రెడ్డి అండగా నిలిచారని సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. రైతుల తరపున నిలబడటం నరేందర్ రెడ్డి హక్కు అని చెప్పారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం భయపడుతోందని, అందుకే నరేందర్ రెడ్డి అక్రమంగా అరెస్ట్ చేశారని ఆరోపించారు. నేతలు, కార్యకర్తలు ఫోన్ చేస్తే నాయకులు మాట్లాడతారని చెప్పారు. ఫోన్ మాట్లాడినంత మాత్రనా అందులో కుట్ర ఏముందని సబితా ఇంద్రా రెడ్డి పేర్కొన్నారు. ఫార్మా నిర్వాసితులతో సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) మాట్లాడి, కచ్చితంగా ఒప్పించాల్సిన అవసరం ఉందన్నారు. అలా చేయకుండా అహంకారపూరితంగా నరేందర్ రెడ్డిని అరెస్ట్ చేయించారని సబితా ఇంద్రారెడ్డి వ్యాఖ్యానించారు.