- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కర్ణాటక డ్రగ్స్ కేసు తో తనకు సంబంధం లేదు: MLA Rohit Reddy
దిశ, తెలంగాణ బ్యూరో: కర్ణాటక డ్రగ్స్ కేసుతో తనకు సంబంధం లేదని తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి స్పష్టం చేశారు. భాగ్యలక్ష్మి టెంపుల్ దగ్గర ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. కర్ణాటక డ్రగ్స్ కేసుపై ప్రమాణం చేద్దామని బండికి సవాల్ చేసిన పైలట్... భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయానికి చేరుకుని పూజలు నిర్వహించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. కర్ణాటక ట్రక్స్ కేస్ పై నేను చేసిన సవాలకు ఎందుకు స్వీకరించలేదని ప్రశ్నించారు. ఆలయానికి రాకపోవడం అంటే బండి చేసిన తప్పును అంగీకరించినట్లేనని అన్నారు. ప్రజాస్వామ్యం అంటే ఆయనకు విలువ లేదని... ఆయన చెప్పేవన్నీ అబద్ధాలు అని స్పష్టంగా అర్థమైంది అన్నారు.
బీజేపీ నేతలు ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో చేసిన తప్పులను కప్పిపుచ్చుకోవడానికే... తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.. ఈడీ వ్యవహారాన్ని తప్పు పడితే బీజేపీ నేతలు ఉలిక్కి పడుతున్నారన్నారు. సిబిఐ, ఐటీ,ఈడీ.. సంస్థలు... బిజెపి నేతలకు సమాచారం ఇచ్చి సహకారంతోనే టార్గెట్ చేస్తున్నాయని ఆరోపించారు. వ్యాపారులు ప్రజాప్రతినిధులపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. పార్టీ మారితే 100 కోట్లు ఇస్తామనిదొంగ స్వాములతో ప్రలోభాలకు గురి చేశారని.. ఆ తప్పులో దొరికిన వారితో సంబంధం లేదని ఒకవైపు చెబుతూనే మరోవైపు ఆరోపణలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రజలు చైతన్యవంతులని ప్రతి అంశాన్ని గమనిస్తున్నారన్నారు. బిజెపి నేతలు ప్రజలపై దొంగ ప్రేమ నటిస్తున్నారని మండిపడ్డారు.
బండి సంజయ్ గురించి మాట్లాడితే ఎమ్మెల్యే రఘునందన్ ఒకానత పుచ్చుకొని మాట్లాడుతున్నాడని... ఆయన మహా మేధావి ఒక సుద్దపూస అని ఎద్దేవా చేశారు. ఆయనకు విలాసవంతమైన పది కోట్ల విలాసాల్లో ఉంటున్నాడని ఎలా వచ్చాయని ప్రశ్నించారు. బిజెపి నేతలు నిజాలు తెలుసుకుని మాట్లాడాలని సూచించారు. రఘునందన్ రావు ఆయన ఇజ్జత్ను ఆయనే తీసుకున్నాడన్నారు. విద్య అర్హతనులను ఎన్నికల అప్పుడే పెట్టిన స్పష్టంగా పేర్కొన్నాలని.. ఇదే విషయంపై కాంగ్రెస్ నేతలు కూడా మాట్లాడారని... వారికి అప్పుడు సమాధానం ఇచ్చానని అదే విషయాన్ని ఇప్పుడు బిజెపి నేతలు మాట్లాడుతున్నారని కావాలి అంటే కాలిఫోర్నియాకు వెళ్లి.. చూసుకోవచ్చు అని అందుకు ఫ్లైట్ టికెట్ కూడా స్పష్టం చేశారు. సర్పనపల్లి ప్రాజెక్టు దగ్గర రిసార్ట్స్ ఉందని ఆరోపణలు చేస్తున్నారని ఆ రిసార్ట్ దగ్గర పైరవీ చేసి వాచ్మెన్ ఉద్యోగం ఇప్పిస్తానని... 15, నెల రోజులు ఉండి సర్వే చేసుకోవాలని సూచించారు.
అలాగే బీజేపీ నాయకులు చేస్తున్న ఆరోపణలు వాస్తవమని రుజువు చేస్తే తన పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నానని తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి అన్నారు. తమ తప్పులను కప్పిపుచ్చుకోవడానికి, ప్రజలను తప్పుదోవ పట్టించేందుకే తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. కర్ణాటక పోలీసులు తనను ఎప్పుడూ విచారణకు పిలువలేదని, ఏ ఎఫ్‌ఐఆర్‌లోనూ తన పేరు లేదని స్పష్టం చేశారు. తనపై చేసిన ఆరోపణల్లో ఏమాత్రం వాస్తవాలు లేవన్నారు