- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
'ఎమ్మెల్యే రసమయి రాజీనామా చేయాలి'
దిశ, గన్నేరువరం: పంటలు ఎండుతున్నప్పటికీ రైతుల గోస పట్టించుకోని ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ వెంటనే రాజీనామా చేయాలని బీజేపీ మండల అధ్యక్షుడు నగునూరి శంకర్ డిమాండ్ చేశారు. శుక్రవారం మండలంలోని మాదాపూర్ హనుమాజి పల్లి గ్రామాల మధ్యన అసంపూర్తిగా వదిలివేసిన డి -9, 1 ఎల్ ఉపకాల్వ వద్ద మండల బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో రైతులతో కలిసి టెంట్ వేసి నిరాహార దీక్ష చేపట్టారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కేవలం 150 మీటర్ల మేర కాలువ పనులు పూర్తి చేస్తే 600 ఎకరాలలో పంటలకు నీరు అందుతుందని, హనుమాజీ పల్లెలో రెండు చెరువులు జలకల సంతరించుకుని మత్స్యకారులకు ఉపాధి లభిస్తుందన్నారు. రైతులు మాట్లాడుతూ వేల రూపాయలు పెట్టుబడి పెట్టి పంటలు సాగు చేసామని సాగునీరు అందక, 24 గంటల కరెంటు వ్యవసాయానికి ఇవ్వకపోవడంతో పంటలు ఎండిపోయే పరిస్థితి ఉందన్నారు.
మాకు ఇప్పుడు ఈ కాలువే దిక్కని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మానకొండూర్ అసెంబ్లీ కన్వీనర్ ముత్యాల జగన్ రెడ్డి, కిసాన్ మోర్చా నాయకులు రాజిరెడ్డి, మండల నాయకులు బండి తిరుపతి అధిక సంఖ్యలో రైతులు పాల్గొన్నారు.