బాలపూర్ గణేషుడికి ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి దంపతుల పూజలు

by Y. Venkata Narasimha Reddy |
బాలపూర్ గణేషుడికి ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి దంపతుల పూజలు
X

దిశ వెబ్ డెస్క్ : మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజ గోపాల్ రెడ్డి, లక్ష్మి దంపతులు హైదరాబాద్ బడంగ్ పేట్ మున్సిపాలిటీ పరిధిలోని బాలాపూర్ గణేషుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రత్యేక పూజల అనంతరం వారికి పురోహితులు వేద ఆశీర్వచనం చేశారు. బాలాపూర్ వినాయకుని దర్శనానికి వచ్చిన రాజ గోపాల్ రెడ్డి దంపతులకు బడంగ్ పేట్ మేయర్ చిగురింత పారిజాత నరసింహారెడ్డి దంపతులు, కాంగ్రెస్ కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ వినాయక నవరాత్రి పూజలను బాలపూర్ గణేష్ ఉత్సవ కమిటీ ఘనంగా కొనసాగిస్తుండటం పట్ల అభినందనలు తెలిపారు. స్వామివారి ఆశీస్సులతో తెలంగాణ ప్రజలంతా సంతోషంగా సుభిక్షంగా ఉండాలన్నారు.

Advertisement

Next Story

Most Viewed