- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కేసీఆర్‌కు మందు పోయడంలో నిరంజన్ రెడ్డి నెంబర్ 4: ఎమ్మెల్యే మేఘారెడ్డి
దిశ, తెలంగాణ బ్యూరో: మాజీ మంత్రి నిరంజన్ రెడ్డికి సిగ్గులేదని దేవరకద్ర ఎమ్మెల్యే మధు సుధన్ రెడ్డి విమర్శించారు. ఆదివారం ఆయన అసెంబ్లీలోని సీఎల్పీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. గడిచిన పది ఏళ్లలో 60 మంది ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలను కేసీఆర్ చేర్చుకోలేదా..? అంటూ మండిపడ్డారు. అప్పుడు నిరంజన్ రెడ్డి గాడిదలు కాశారా..? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ పక్కనే ఉండి ఫిరాయింపులను అడ్డుకోకుండా ఏం చేస్తున్నావ్ అని ఫైర్ అయ్యారు. తమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజాపాలనకు ఆకర్షితులై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరుతున్నారన్నారు.
కానీ మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి సిగ్గు లేకుండా మాట్లాడుతున్నాడని ధ్వజమెత్తారు. కేసీఆర్‌కు వత్తాసు పలుకుతూ పళ్లు ఇగిలించిన నిరంజన్ రెడ్డి, ఇప్పుడు జాయినింగ్స్‌పై ప్రశ్నించడం విడ్డూరంగా ఉన్నదన్నారు. నిరంజన్ రెడ్డి అవినీతి కంపు వనపర్తిలో ఇంకా కొడుతూనే ఉన్నదన్నారు. తెలంగాణ నీళ్లను దోచుకుపోతున్న జగన్‌ను ప్రగతి భవన్‌కు ఎలా తీసుకువచ్చారు..? అంటూ ప్రశ్నించారు. అందుకే బీఆర్ఎస్ కృష్ణానదిలో కొట్టుకుపోయిందని, స్థానిక ఎన్నికల తర్వాత కనిపించదని స్పష్టం చేశారు.
వనపర్తి ఎమ్మెల్యే మెఘారెడ్డి మాట్లాడుతూ.. కేసీఆర్‌కు మందు పోయడంలో నిరంజన్ రెడ్డి నెంబర్ 4 అని ఎద్దేవా చేశారు. గతంలో తెలుగుదేశంలో పనిచేసిన విషయాన్ని నిరంజన్ రెడ్డి మరిచిపోయినట్లున్నాడని గుర్తు చేశారు. ఖాదీ బోర్డు చైర్మన్‌గా ట్రాక్టర్ల స్కామ్ చేస్తే చంద్రబాబు టీడీపీ నుంచి మెడలు పట్టుకొని బయటకు దొబ్బాడని ఆరోపించారు. టీడీపీ నుంచి సస్పెండ్ చేస్తే గతి లేక బీఆర్ఎస్ పార్టీలో చేరాడని, తాము పెట్టిన బిక్షతోనే వనపర్తిలో ఎమ్మెల్యేగా గెలిచాడని స్పష్టం చేశారు. ఒక మహిళ అని చూడకుండా షర్మిలను మంగళవారం మరదలు అని బలుపు మాటలు మాట్లాడిన చరిత్ర నిరంజన్ రెడ్డిది అని విమర్శించారు. నిరంజన్ రెడ్డి అవినీతి బాగోతంపై దర్యాప్తు సంస్థలకు లేఖలు రాస్తామన్నారు. కొండా లక్ష్మణ్ బాపూజీ యూనివర్సిటీలో తన వియ్యంకుడిని అక్రమంగా వీసీగా నియమించుకున్నాడన్నారు. దీనిపై కూడా ఎంక్వైరీ కోరతామన్నారు.